By: Oneindia Telugu Video Team
Published : July 27, 2017, 11:47

మాకు మంచి రోజులు స్టార్ట్ అయ్యాయి....

Subscribe to Oneindia Telugu

భారత్‌లో మహిళల క్రికెట్‌కు మంచి రోజులు మొదలయ్యాయని టీమిండియా కెప్టెన్ మిథాలీ రాజ్ చెప్పింది. ఉమెన్ వరల్డ్ కప్‌లో రన్నరప్‌గా నిలిచిన మిథాలీ సేన బుధవారం తెల్లవారుజామున ఇంగ్లాండ్‌ నుంచి ముంబైకి చేరుకోగానే అభిమానులు ఘన స్వాగతం పలికిన సంగతి తెలిసిందే.
అయితే గతంలో ఎన్న‌డూలేనంత ఆద‌ర‌ణ ఇప్పుడు ల‌భించ‌డంతో భారత మహిళల జట్టు ఎంతో సంతోషంలో మునిగి తేలుతోంది. ముంబైకి చేరుకున్న అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మిథాలీ మాట్లాడుతూ 'మ‌హిళ‌ల క్రికెట్‌కు ఇప్పుడే మంచి రోజులు మొద‌ల‌య్యాయి' అని చెప్పింది.'అభిమానుల మద్దతు చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఇలా ఘన స్వాగతం లభించడం ఇదే మొదటిసారి. 2005లో ఇలాంటి సందర్భమే చోటు చేసుకున్నా, ఇంతటి రెస్పాన్స్ మాత్రం రాలేదని ఖచ్చితంగా చెప్పగలను. ఇది కేవలం ఆరంభం మాత్రమే' అని మిథాలీ రాజ్ చెప్పింది.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా