By: Oneindia Telugu Video Team
Published : July 21, 2017, 04:23

సివంగిలా సింహనాదం చేసిన హర్మన్‌ప్రీత్‌ కౌర్‌

Subscribe to Oneindia Telugu

ఏం చెప్పగలం ఆ విధ్వంసాన్ని.. ఎంతని పొగడగలం ఆ పరాక్రమాన్ని.. ఎలా వర్ణించగలం ఆ ధీరత్వాన్ని.. ఆడుతోంది అమ్మాయేనా.. చూస్తోంది మహిళల మ్యాచేనా.. అన్న అనుమానం కలిగేలా.. ఆస్ట్రేలియాపై హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సివంగిలా సింహనాదం చేసింది. హర్మన్‌ప్రీత్‌ను ఎంత పొడిగినా తక్కువే. ఆమె లాగిపెట్టి సిక్స్‌ కొట్టినా అందమే. లాఘవంగా డ్రైవ్‌ చేసినా అందమే! మామూలు బ్యాటింగా అది! మళ్లీ బంతి దొరకదేమో అన్నంత కసిగా ఆడింది. ఆమె ఐదో గేర్లోకి మారాక బంతెప్పుడూ బౌండరీ లైన్‌ దగ్గరే. పవర్‌ హిట్టింగ్‌తో ఆమె ఆడిన ఇన్నింగ్స్‌ అభిమానులకు ఎంతో అపురూపం.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా