By: Oneindia Telugu Video Team
Published : December 18, 2017, 01:39

కమ్మనైన పాటల సంగమం..!

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్ వేదికగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ సాహిత్య అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టిన ప్రపంచ తెలుగు మహాసభలు శుక్రవారం ఎల్బీస్టేడియంలో సంబరంగా ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడును, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు వేదిక మీదకు సాదరంగా ఆహ్వానించారు.
ఈ నెల డిశంబర్ 15 నుండి 19 వరకు జరుగుతున్న ఈ సభలకు ఇప్పటికే హాజరైన భాషాభిమానులు, కవులు, సాహితీవేత్తలతో నగరానికి కొత్తకళ వచ్చింది, తెలంగాణ ప్రభుత్వ ఏర్పాట్లలో లోటుపాట్లు ఉన్నప్పటికీ హాజరైన వాళ్ళు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా వివిధ రాష్టాల నుంచి, జిల్లాల నుంచి హాజరైన భాషాభిమానులను పలకరించినప్పుడు వారి స్పందన... జయశంకర్ భూపాలపల్లి జిల్లా రాష్ట్ర ఉపాధ్యాయ పరిషత్తు నుంచి 250 మందిని తీసుకొచ్చిన వేల్పులస్వామి యాదవ్ కమ్మనైన తెలుగు పద్యం పాడుతూ తన అనుభూతిని పంచుకున్నారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా