By: Oneindia Telugu Video Team
Published : December 15, 2017, 03:05

ప్రపంచ తెలుగు మహాసభలు : NTR నే మరిచిపోయారా ?

Subscribe to Oneindia Telugu

ప్రపంచ తెలుగు మహాసభలు ఈరోజు హైదరాబాదులో అట్టహాసంగా ప్రారంభం కానున్నాయి. హైదరాబాదులోని లాల్ బహుదూర్ స్టేడియంలో ప్రపంచ తెలుగు మహాసభల ప్రారంభ సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు దేశ, విదేశాల నుంచి ప్రముఖులు, తెలుగుభాషా పిపాసులు హాజరవుతున్నారు.. అయితే, మహాసభలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ప్రారంభ వేడుకకు ఆహ్వానించే అవకాశం లేదని అర్థమవుతోంది. ఉప రాష్టప్రతి వెంకయ్యనాయుడు, గవర్నర్ నరసింహన్, మహారాష్ట్ర గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్‌రావు, సభాధ్యక్షులుగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈ సదస్సుకు విశిష్ట అతిథులుగా హాజరవుతున్నారు.
మహాసభల ముగింపు వేడుకకు చంద్రబాబునాయుడుని ఆహ్వానించాలని తెలంగాణ ప్రభుత్వం తాజాగా నిర్ణయించినట్లు సమాచారం. ముగింపు సమావేశానికి రాష్ట్రపతి కోవింద్ వస్తున్నారు. దానికి చంద్రబాబును ఆహ్వానించే అవకాశం ఉందని అంటున్నారు.
ఇక ఇదిలా ఉంటె ప్రపంచ తెలుగు మహాసభలకు ఎన్టీఆర్ పేరుతో స్వాగత ద్వారాలు ఏర్పాటు చేయకపోవడంపై దివంగత ఎన్టీ రామారావు అభిమానులు శుక్రవారం తమ నిరససను వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రపంచ తెలుగు మహాసభలు శుక్రవారం హైదరాబాదులో ప్రారంభమవుతున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ స్వాగత ద్వారం ఏర్పాటు చేయకపోవడంపై ఆయన అభిమానులు గరికపాడు దగ్గర గుండు గీయించుకుని నిరసనను తెలిపారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా