• search
By : Oneindia Telugu Video Team
Published : May 07, 2018, 04:21
Duration : 03:45

తన సంగీత ప్రయాణాన్ని వివరించిన మ్యూజిక్ డైరెక్టర్ యాజమాన్య

వర్థమాన సినీ సంగీత దర్శకుడు నయా మెలోడీ సాంగ్స్ సృష్టికర్త యాజమాన్య. పోటీ అత్యంత తీవ్రంగా ఉండే సినీ పరిశ్రమలోకి సంగీత దర్శకుడిగా ఆరంగ్రేటం ఇచ్చిన ఈ కొత్త కెరటం టాలీవుడ్ సంగీత సాగరంలో తనదైన ముద్ర వేసుకుంటూ ముందుకు సాగిపోతోంది. కీ బోర్డ్ ప్లేయర్ గా సినీ పరిశ్రమలో అడుగుపెట్టి వందల సినిమాలకు పనిచేసిన ఈ యువ సంగీత సామ్రాట్ ఎటువంటి గాడ్ ఫాదర్ల అండ లేకుండానే టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదిగారు.
సంగీత దర్శకుడిగా మారిన అనతి కాలంలోనే పది సినిమాలకు మ్యూజిక్ డైరెక్షన్ వహించిన ఈ టాలెంటెడ్ మ్యుజీషియన్ యాజమాన్య సంగీత దర్శకత్వం వహించిన ఐదు సినిమాలు కొద్దివారాల వ్యవధిలో విడుదల కానున్నాయంటేనే ఇతగాడి టాలెంట్ అర్థం చేసుకోవచ్చు. తాజాగా పెదరావూరు ఫిలిమ్‌ స్టూడియో ఆధ్వర్యంలో నిర్మించనున్న 'పండుగాడి ఫోటోస్టూడియో' సినిమా సంగీతం కోసమని తొలిసారిగా గుంటూరు జిల్లాకు విచ్చేశాడు. తాను ఇళయరాజకు ఏకలవ్య శిష్యుడినని ఏ భేషజాలు లేకుండా చెబుతున్న ఈ వర్థమాన సంగీత దర్శకుడు తన అంతరంగంలోని కొన్ని ఆలోచనలు మీడియా ముందు ఆవిష్కరించారు.
"మ్యూజిక్‌ మాస్త్రో ఇళయరాజాకు నేను ఏకలవ్య శిష్యుడు. ఆయన పాటతో అల్లుకున్న అనుబంధమే నా సంగీత ప్రపంచానికి నాంది" అని చెబుతున్న యాజమాన్య ఎలాంటి సినీ నేపధ్యం లేకుండానే తాను సినిమా రంగంలోకి కాలుమోపినట్లు తెలిపాడు. కీబోర్డు ప్లేయరుగా టాలీవుడ్ లో ఎంటరై వందలాది సినిమాలకు పనిచేసాడు. ఆ అనుభవానికి తనలో సహజ సిద్దంగా ఉన్న టాలెంట్ ను రంగరించి, కొద్ది కాలం వ్యవధిలోనే పదికి పైగా సినిమాలకు సంగీత దర్శకత్వం వహించే అవకాశం పొందాడు. అంతేకాదు మెలోడీ లవర్ గా తన సినిమాల్లో వినసొంపైన బాణీలను స్వరపరచి యువతరాన్ని మంత్రముగ్ధులను చేశాడు. టైటానిక్‌ సినిమాలో ‘పడిపోతున్నా నీ మాయలో', దళపతిలో శ్రేయోఘోషల్‌ పాడిన పాట ‘నీకూ నాకూ మధ్య ఏదో ఉంది', ‘రాజూ..దిల్‌రాజూ' పాటలతో యాజమాన్య యువతరంలో ప్రత్యేక గుర్తింపు పొందాడు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more