By : Oneindia Telugu Video Team
Published : December 27, 2016, 11:59

కలెక్టరేట్ల ముందు వైసిపి ధర్నాలు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఆరోగ్యశ్రీ పథకం అమలవుతున్న తీరుకు నిరసనగా వైసీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు ఏపీలో క‌లెక్ట‌రేట్ల ముందు ధ‌ర్నాలో వైసీపీ అధినేత జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఆరోగ్యశ్రీ స‌రిగా అంద‌డం లేద‌ని ప్రతి పేదవాడు రాష్ట్ర ప్ర‌భుత్వంపై మండిప‌డుతున్నాడ‌ని ఆయ‌న అన్నారు. పేదవాడు రెండు కార‌ణాల వ‌ల్ల అప్పుల పాలు అవుతాడ‌ని అవి అనారోగ్యం, పిల్లల చదువేన‌ని ఆయ‌న అన్నారు. వైఎస్ఆర్ కంటే ముందు రాష్ట్రాన్ని పాలించిన వారు పేదల మీద, బీసీల మీద ఎంతో ప్రేమ‌ ఉందని చెప్పుకునే వారని, కానీ, వారికి ఏం కావాలో తెలుసుకున్న నాయ‌కుడు వైఎస్ఆరేన‌ని అన్నారు. వైఎస్ఆర్ కంటే ముందు పాలించిన నాయ‌కులు వారికి ఇస్త్రీ పెట్టెలు ఇస్తే, క్షవరం చేసుకోడానికి కత్తెరలు ఇస్తే సరిపోతుందని భావించేవార‌ని, కానీ, వైఎస్ఆర్ అలా ఆలోచించ‌లేద‌ని ఫీజు రీయింబ‌ర్స్‌మెంటుతో ఇంజనీరింగ్, వైద్యవిద్యను అందించార‌ని జగన్ చెప్పారు. అటువంటి నాయ‌కుడు ప్రవేశపెట్టిందే ఆరోగ్యశ్రీ పథకమ‌ని, ఇప్పుడు దాన్ని కూడా ప‌ట్టించుకున్న పాపాన రాష్ట్ర ప్ర‌భుత్వం లేద‌ని ఆయ‌న అన్నారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా