By : Oneindia Telugu Video Team
Published : December 22, 2017, 11:45

కర్ణాటకలో యోగి ఆదిత్యనాథ్ ప్రచారం, ఉత్తరప్రదేశ్ శాంతి భద్రతల మాటేమిటి ?


కర్ణాటకలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చేందుకు ఇప్పటికే ప్రణాళికలను సిద్ధం చేసుకుంది. పలువురు బీజేపీ నేతలు ప్రచారాలు కూడా మొదలుపెట్టారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కర్ణాటకలో గురువారం ప్రచారం నిర్వహించారు. బీజేపీ నేత, కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్ప అధ్యక్షతన జరుగుతున్న పరివర్తన ర్యాలీని సీఎం యోగి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీపై విమర్శల వర్షం కురిపించారు.
గో మాంసం తివచ్చంటూ జాతి నైతికతను దెబ్బతీసిన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య నుంచి మనం ఏమీ ఆశించలేమని యోగి తేల్చి చెప్పారు. ఎంతో గొప్ప ఆధ్యాత్మిక, సాంస్కృతిక చరిత్ర కలిగిన కర్ణాటకలో మొహమ్మద్ అలీ షా, టిప్పు సుల్తాన్ జయంతులను కాంగ్రెస్ పార్టీ నిర్వహించడంపై ఆయన మండిపడ్డారు.
వచ్చే ఏడాది జరగబోయే ఎన్నికల్లో హనుమంతుడు దిగుతున్నారని, పోటీ టిప్పు సుల్తాన్‌కు హనుమంతుడికి మధ్య ఉంటుందని తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకను హనుమంతుడి భూమిగా గుర్తిస్తారని, అలాంటిది కాంగ్రెస్ మాత్రం ఆయనను పూజించకుండా గత రెండేళ్లుగా టిప్పు సుల్తాన్ జన్మదిన వేడుకలు జరుపుతుందని విమర్శించారు. టిప్పు సుల్తాన్ స్వాతంత్ర్య పోరాటయోధుడని అంటోందని.. అలాంటి కాంగ్రెస్‌ను హనుమంతుడు ఇక ఓడిస్తాడని అన్నారు

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా