By: Oneindia Telugu Video Team
Published : January 09, 2018, 05:32

పాదయాత్ర లో నిప్పులు చెరుగుతున్న జగన్, రోజా : వీడియో

Subscribe to Oneindia Telugu

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర చిత్తూరు జిల్లాలోని పూతలపట్టు నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఆయన పాదయాత్ర సోమవారానికి 56వ రోజుకు చేరుకుంది. మొరవపాటూరు నుంచి ప్రారంభమైన పాదయాత్ర కొండారెడ్డిపల్లి క్రాస్ నుంచి తలుపులపల్లి, తిమ్మిరెడ్డిపల్లి, తోటలోపు, టీ రంగం మీదుగా సాగుతుంది. అక్కడి నుంచి రంగంపేట క్రాస్ చేరుకొని పార్టీ జెండా అవిష్కరించారు. అనంతరం పూతలపట్టులో బహిరంగ సభలో మాట్లాడుతారు. అనంతరం సమనత్తం మీదుగా అనంతారం వరకు పాదయాత్ర చేస్తారు. పాదయాత్రలో భాగంగా ఆయన 766 కిలోమీటర్లకు పైగా నడిచారు. సీఎం చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో జగన్ పాదయాత్ర కొనసాగుతోంది.
చిత్తూరు జిల్లాలో పాడి రైతుల పరిస్థితి మరింత దయనీయంగా ఉందని, వారిని ఆదుకునేందుకు బాబు ఎటువంటి చర్యలు తీసుకోలేదని జగన్ అన్నారు. తమ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డాక పాడి రైతులకు తప్పకుండా న్యాయం జరగుతుందన్నారు. రైతు, డ్వాక్రా రుణాల మాఫీ పేరుతో గద్దెనెక్కిన బాబు సంబంధిత వర్గాల వారికి పైసా కూడా మాఫీ చేయకుండా కాలయాపన చేస్తున్నారన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి పాలనలో హంద్రీ- నీవా ప్రాజెక్టు పనులు 80 శాతం పూర్యయ్యాయని, అయితే మిగిలిన 20 శాతాన్ని పూర్తి చేయలేని స్థితిలో నేడు రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా