• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : January 09, 2018, 05:50
    Duration : 25:28

    జగన్‌ ప్రజా సంకల్ప యాత్ర - జగన్ ముఖాముఖీ

    చిత్తూరు జిల్లాలో వైఎస్‌ జగన్‌ ప్రజాసంకల్పయాత్ర . ఆయన పాదయాత్రకు ప్రజలనుంచి ఆదరణ లభిస్తోంది. వేలాది మంది అభిమానులు, కార్యకర్తలు అండగా వైఎస్‌ జగన్‌తో కలిపి అడుగులు వేస్తున్నారు
    జన్మభూమి కమిటీ పేరుతో ఒక మాఫియాను తయారు చేశారు. పింఛన్లు, మరుగుదొడ్డి కావాలన్నా లంచం ఇవ్వాలి. పింఛన్లకు 60 ఏళ్ల వయస్సు సరిపోదట..కాళ్లు, చేతులు లేకపోతే సరిపోదట..జన్మభూమి కమిటీలు సిపార్సులు చేయాలట.
    కన్నతల్లిలాంటి ఊరిని, పిల్లనిచ్చిన మామను, సొంత తమ్ముడిని, ఓట్లు వేసిన ప్రజలను వెన్నుపోటు పొడిచిన ఘనత ఒక్క చంద్రబాబుకే దక్కుతుంది అని ప్రజాసంకల్ప యాత్ర లో ప్రజలతో జగన్ ముఖాముఖీ లో చంద్రబాబు పై నిప్పులు చెరిగారు. ప్రముఖ పుణ్యక్షేత్రాలైన తిరుమల, కాణిపాకం ఆలయాల పాలకమండళ్ల పదవీకాలం పూర్తయి నెలలు కావస్తున్నా కొత్త పాలకమండళ్లను ఏర్పాటు చేయలేని దుస్థితిలో ప్రస్తుత ప్రభుత్వం ఉందని జగన్ మండిపడ్డారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టామని చెబుతున్న జన్మభూమి కమిటీలు మాఫీయా ముఠాలుగా మారాయన్నారు. ప్రజలను మోసం చేయడంలో బాబు పిహెచ్‌డి చేశారని, వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధించి అధికారంలోకి వస్తే ఇంటింటికి ఒక కేజీ బంగారంతో పాటు, ఒక బెంజి కారును ఉచితంగా ఇస్తానని కూడా హామీ ఇచ్చే రకమన్నారు.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా