By : Oneindia Telugu Video Team
Published : March 16, 2017, 11:49

జగన్ తప్పు చేసారా...? జగన్ యాటిట్యూడ్ మరోసారి బయట పడిందా..?

మొన్నటి వరకూ వైసీపీలో ఉన్న నాయకుడు. ఆ పార్టీ తరపున టికెట్‌ తీసుకుని గెలిచిన నాయకుడు. అప్పుడు మంచి వ్యక్తి ... ఇప్పుడు చెడ్డ వ్యక్తి అయిపోయారా..? భూమా నాగిరెడ్డిపై జగన్‌ చేస్తున్న ఆరోపణలు నిజమే అయితే... అప్పట్లో ఆయనకు టికెట్‌ ఎలా కేటాయించారు..? ఇప్పుడు ఇవే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ విషయం పక్కన పెడితే... ఒక శాసనసభ్యుడు మరణించినపుడు... ఆయనకు సంబంధించి సభలో జరిగే సంతాప సభలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి. మరణించిన నాయకుడు చేసిన మంచిపనులను మాత్రమే ప్రస్తావించి... ఆయన మృతిపట్ల సంతాపం వ్యక్తం చేయాలి. ఇది మావవ ధర్మం. సభా సంప్రదాయం. మన భారతీయ సంస్కృతి

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా