By: Oneindia Telugu Video Team
Published : November 23, 2017, 10:27

నేను హీరోను గెలుస్తా!, నీకు కోర్టులు, జైళ్ళు చాలు

Subscribe to Oneindia Telugu

తాను విలన్ పైన పోరాటం చేస్తున్న హీరోను అని, వచ్చే ఎన్నికల్లో తనకే ఓటు వేయాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఆయన ప్రజా సంకల్ప యాత్ర కర్నూలు జిల్లాలో కొనసాగుతోంది.పాదయాత్ర సందర్భంగా జగన్ ప్రజలతో మమేకం అవుతున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు హామీలు ఇస్తున్నారు. బహిరంగ సభల్లో మాట్లాడుతున్నారు. తాను అధికారంలోకి వస్తే రేషన్ కార్డుపై 9 సరుకులు ఇస్తానని స్పష్టం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం పతనం కావడం ఖాయమన్నారు.
వచ్చే ఎన్నికల్లో వైసీపీ 137 స్థానాల్లో విజయం సాధిస్తుందని జగన్ ధీమా వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా వస్తేనే రాష్ట్రానికి న్యాయం జరుగుతుందన్నారు. హోదా ఇస్తామని చెప్పిన బీజేపీ, తెస్తామని చెప్పిన చంద్రబాబు మాట తప్పారన్నారు. హామీలు ఇచ్చి మోసం చేయడం చంద్రబాబుకు అలవాటే అన్నారు
మీరు సినిమాకు వెళ్తే అబద్దాలు చెబుతూ, వెన్నుపోట్లు పొడుస్తూ, అన్యాయాలు, అక్రమాలు చేసే విలన్ మీకు నచ్చుతాడా లేక వాటిని ఎదుర్కొనే న్యాయంగా ఉండే హీరో నచ్చుతాడా అని జగన్ ప్రశ్నించారు. మనకు అన్యాయాన్ని ఎదిరించే హీరో నచ్చుతాడన్నారు. రాబోయే ఎన్నికల్లో హీరోలాంటి నాయకుడిని ఎన్నుకోవాలని చెప్పారు. వైసీపీని గెలిపించాలన్నారు. తాను సీఎంను అవుతానని చెప్పారు. తద్వారా తాను చంద్రబాబు అనే విలన్ పైన పోరాడుతున్న హీరోను అని అభిప్రాయపడ్డారు. గత ఎన్నికల్లో జగన్ ఎన్నో అబద్దాలు చెప్పారన్నారు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా