• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : December 31, 2017, 04:48
    Duration : 10:57

    జగన్ సెటైర్లు : జగన్ లో ఈ యాంగిల్ కూడా ఉందా ?

    బడ్జెట్ సమావేశాల సందర్భంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై విమర్శలతో విరుచుకుపడ్డారు. రాష్ట్రానికి నీళ్లు రాకుండా మోటార్లు పెడుతుంటే చంద్రబాబు నోరు మెదపడం లేదని అన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అన్ని స్కాములే జరుగుతున్నాయని, వాటిపై విచారణ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడమే చంద్రబాబుకు సరిపోతోందని జగన్ ఎద్దేవా చేశారు. ఇసుక నుంచి రాజధాని వరకు అన్ని స్కాములేనని ఆరోపించారు. సూట్ కేసుల్లో నల్లధనం ఇస్తూ ఆడియో వీడియో టేప్ లతో దొరికిపోయారు కానీ పదవికి రాజీనామా చేయకుండా ఉన్న పరిస్థితి మన రాష్ట్రానికి జరుగుతోంది. సూట్ కేసుల్లో నల్లధనం ఇస్తూ ఆడియో, వీడియో టేపుల్లో దొరికిపోయినా.. ఆయనే ప్రభుత్వాధినేతగా ఉండటం మన రాష్ట్రంలోనే జరుగుతోందని ఓటుకు నోటు కేసును జగన్ ప్రస్తావించారు. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడినా కూడా తన పదవికి రాజీనామా చేయకపోవడం ఆయనకే చెల్లుతుందని అన్నారు. పోలవరం ప్రాజెక్టును కేంద్రమే కడతామంటే.. తమ కంట్రాక్టర్ల కోసం చంద్రబాబే ఆ ప్రాజెక్టును తీసుకుని ఎస్టిమేషన్ రేటు పెంచారని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతికే ఉందా? అని ప్రశ్నించారు. హోదా కోసం చేస్తున్న కొవ్వొత్తుల ర్యాలీని అడ్డుకోవడం ఏంటని ఆయన నిలదీశారు. ఏపీలో పోలీసు రాజ్యం బ్రిటీషు పాలనను తలపిస్తోందని అన్నారు. స్వాతంత్ర్యం రాకముందు చంద్రబాబునాయుడు లీడర్‌గా లేకపోవడం మనకు సంతోషకరమైన విషయమని అన్నారు.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా