By: Oneindia Telugu Video Team
Published : December 04, 2017, 04:33

జగన్ మటాష్, మోడీకి పెళ్లాం-పిల్లలు లేరు

Subscribe to Oneindia Telugu

వైసీపీ అధినేత వైయస్ జగన్ బీజేపీతో కలిస్తే ఆయన పని అయిపోయినట్లేనని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు సాధించలేకపోతున్న చంద్రబాబు సీఎంగా ఉండటం దురదృష్టకరమన్నారు. గత ఏడాదిన్నరగా చంద్రబాబుకు మోడీ అపాయింటుమెంట్ ఇవ్వడం లేదన్నారు. ఏం చేయలేని నిస్సహాయస్థితిలో చంద్రబాబు ఉన్నారని ఎద్దేవా చేశారు. బల్లగుద్ది మోడీతో వాదించే ధైర్యం చంద్రబాబుకు లేదన్నారు. పోలవరం ప్రాజెక్టు లేకుంటే ఆంధ్రప్రదేశే లేదని, ఈ ప్రాజెక్టుకు ఇంకా ఎన్ని సంవత్సరాలు పడుతుందో ఊహించలేకపోతున్నామన్నారు. ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.
మోడీ వద్ద చంద్రబాబు ఎందుకు తలొగ్గి బలహీనుడు అయ్యారో అసలు కారణం తెలియడం లేదని ఉండవల్లి అన్నారు. ఈ పరిస్థితి రావడం సిగ్గుచేటు అన్నారు. బీజేపీతో జగన్ కలిస్తే మటాష్ అయిపోతారన్నారు. ఆయనకు ఉన్న మైనార్టీ ఓటు బ్యాంకు దూరం అవుతుందని హెచ్చరించారు. 2014లో తొలుత జగన్‌ను సంప్రదించి, అక్కడ పొత్తు కుదరకే బీజేపీ.. టీడీపీ వైపు వెళ్లిందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.జగన్ తమకు తెలిసినప్పటికీ ఆయనను అధికారంలోకి తీసుకు వచ్చేంత సమర్థత తమ వద్ద లేదని ఉండవల్లి అన్నారు. అదే ఉంటే తానే అధికారంలో ఉండేవాడిని అని చెప్పారు. తనకు ఆ శక్తి, ఆసక్తి లేవని చెప్పారు. వైయస్ తమకు మిత్రుడైనంత మాత్రాన జగన్‌పై తమకు ప్రేమ ఉందని, చంద్రబాబును విమర్శిస్తుంటానని మాట్లాడటం అర్థరహితమన్నారు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా