Telangana చరిత్రలో బ్లాక్ డే, షర్మిల ముఖంపై గాయాలు
Published : November 29, 2022, 12:20
ఈరోజు తెలంగాణ చరిత్రలో చీకటి దినమని వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు. తన పాదయాత్రకు ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూడలేకే లా అండ్ ఆర్డర్ సమస్య సాకుగా చూపించి అరెస్టు చేశారని మండిపడ్డారు. సోమవారం సాయంత్రం హైదరాబాద్లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు షర్మిల.