By : Oneindia Telugu Video Team
Published : May 11, 2017, 03:17

జగన్ కు నీతులు చెప్పి tdp ఏం చేస్తుంది...?

అధికారంలో ఉన్న టీడీపీ ఏం చేస్తుంది..? ఒకప్పుడు జగన్‌ చేసిన తప్పిదాన్నే మళ్లీ ఇప్పుడు టీడీపీ చేస్తుందా..? అనవసర ఆరోపణలు.. అనవసర రాద్ధాంతాలు ఎందుకు..? నిరాధార ఆరోపణలు చేయడం వల్ల ప్రజల్లో చులనక కావడమే తప్ప అంతకు మించి ఒరిగేదేంటి..? అసలు టీడీపీ ఎందుకిలా చేస్తుంది..? గతం మరిచి... వాస్తవాలను పక్కను పెట్టి... కొత్త తప్పులు చేసే దిశగా ఎందుకు నిర్ణయాలు తీసుకుంటుంది..?
ఒక అలిగేషన్‌ చేసేటప్పుడు.... ఒక ఖచ్చితత్వం ఉండాలి. ఒక ఆరోపణ చేసినపుడు ఒక ఆధారం ఉండాలి. ఒక విమర్శ చేసినపుడు ఒక లక్ష్యం ఉండాలి. ఇవేమీ లేకుండా గాల్లో మాటలు చెప్పి.... నీటిపై రాతలు రాసేస్తే... అది రాజకీయమవుతుందా..? ప్రత్యర్థి పార్టీపై నిరాధార ఆరోపణలు చేస్తేనే మనుగడ ఉంటుందని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయా..? ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఇలాంటి అనుమానాలే కలుగుతున్నాయి.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా