By: Oneindia Telugu Video Team
Published : November 27, 2017, 10:36

టీడీపీలో చేరనున్న ఈశ్వరి

Subscribe to Oneindia Telugu

అనుకున్నదే జరిగింది. పాడేరు వైసీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి టీడీపీ కండువా కప్పుకోవడానికి సన్నద్దమయ్యారు. ఆమెతో పాటు మరో 60 మంది ఎంపీటీలు, స‌ర్పంచ్‌లను వెంటబెట్టుకుని టీడీపీలో చేరనున్నారు. ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు స‌మ‌క్షంలో సోమవారం ఆమె టీడీపీలో చేరనున్నారు. ఈమేర‌కు ఆదివారం సాయంత్రం నియోజ‌క‌వ‌ర్గం నుంచి 25 వాహనాల్లో అమ‌రావ‌తికి బ‌య‌లుదేరారు. ఎమ్మెల్యే ఈశ్వ‌రి, ఆమె గురువు గోవింద‌రావు త‌దిత‌రులు మ‌రో రెండు వాహ‌నాల్లో బ‌య‌లుదేరారు.
విశాఖ ఏజెన్సీ ఏరియాలో గిడ్డి ఈశ్వరి బలమైన నేతగా ఉన్నారు. పదునైన మాట తీరుతో పలుమార్లు అధికార పక్షాన్ని కడిగిపారేశారు. అయితే రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వాలు ఉండవన్న మాట ఇప్పుడు గిడ్డి ఈశ్వరి విషయంలోను రుజువవుతోంది. గతాన్ని పక్కనబెట్టి భవిష్యత్తు రాజకీయాల కోసం ఆమె టీడీపీలో చేరుతున్నారు. వైసీపీలో భవిష్యత్తు ఇరుకుగా అనిపించడం వల్లే ఆమె వైసీపీలో చేరుతున్నట్టు తెలుస్తోంది.
ఈశ్వరి చేరికతో టీడీపీ బలం మరింత పెరగనుంది. ముఖ్యంగా అరకు, పాడేరు నియోజకవర్గాల్లో ఈశ్వరి కీలక నేతగా ఉన్నారు. ఆమె చేరికతో ఆ ప్రాంతంలోని ప్రజలంతా టీడీపీ వైపు చూసే అవకాశం లేకపోలేదు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఈ రెండు స్థానాలు టీడీపీకి అనుకూలంగా మారే సూచనలున్నాయి. గత ఎన్నికల్లో అర‌కు లోక్‌స‌భ‌, పాడేరు, అర‌కులోయ అసెంబ్లీ స్థానాల‌ను వైసీపీ గెలుచుకుంది. అర‌కు ఎంపీ కొత్త‌ప‌ల్లి గీత ఇప్ప‌టికే వైసీపీ దూరంగా ఉండ‌గా, అర‌కు ఎమ్మెల్యే కిడారి స‌ర్వేశ్వ‌ర‌రావు గ‌తేడాది టీడీపీలో చేరారు. అయితే ఈశ్వరి మాత్రం అవేవి పట్టించుకోకుండా పార్టీలోనే కొనసాగుతూ వచ్చారు. కానీ ఇటీవలి పరిణామాలు ఆమెను పొమ్మనకుండా పొగపెట్టినట్టుగా ఉండటంతో ఆమె నొచ్చుకున్నారు. అందువల్లే వైసీపీని వీడటానికి నిర్ణయించుకున్నారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా