By : Oneindia Telugu Video Team
Published : February 27, 2021, 05:40
Duration : 02:56
02:56
YUSUF PATHAN రిటైర్స్ తన లైఫ్ లో బెస్ట్ మూమెంట్ అదే!!
టీమిండియా ఆల్‌రౌండర్, బరోడా బ్యాట్స్‌మన్ యూసఫ్ పఠాన్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ట్విట్టర్ వేదికగా యూసఫ్ శుక్రవారం ప్రకటించాడు. టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ సోదరుడు అయిన యూసుఫ్.. చివరిసారిగా 2012లో భారత్ తరఫున ఆడాడు. 2007 టీ20 ప్రపంచకప్‌తో క్రికెట్లోకి అడుగుపెట్టిన యూసఫ్.. 2012 తర్వాత ఒక మ్యాచ్ కూడా ఆడలేదు. ఫామ్ కోల్పోవడం, కుర్రాళ్లు జట్టులోకి రావడంతో టీంలో చోటుదక్కించుకోలేకపోయాడు.