By : Oneindia Telugu Video Team
Published : August 28, 2017, 03:08

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న యువరాజ్ ష‌ర్ట్‌ లెస్ సెల్ఫీ..

మూడు టెస్టులు, ఐదు వన్డేలు, ఒక టీ20 సిరిస్ కోసం కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా శ్రీలంక పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. యో-యో పరీక్షలో విఫలమైన కారణంగా టీమిండియా వెటరన్ క్రికెటర్ యువరాజ్ సింగ్ జట్టులో చోటు కోల్పోయిన సంగతి తెలిసిందే. లంక సిరిస్ పర్యటనకు గాను చోటు కోల్పోయిన యువరాజ్ తాజాగా ష‌ర్ట్‌లెస్ సెల్ఫీని త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఈ ఫోటో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంది. దీంతో ర‌క‌ర‌కాల ఫన్నీ కామెంట్లు వెల్లువ‌లా వ‌చ్చాయి. ఈ కామెంట్లలో తన సహచర ఆటగాళ్లు హ‌ర్భ‌జ‌న్ సింగ్‌, రోహిత్ శ‌ర్మ‌లు చేసిన కామెంట్లు అందరి దృష్టిని ఆక‌ర్షిస్తున్నాయి. స‌ల్లూ భాయ్‌ అంటూ భ‌జ్జీ కామెంట్ చేయ‌గా, మూడ్ అన్నావ్‌! ఎలాంటి మూడ్ అనేది స‌రిగా చెప్ప‌లేదు.. ఇంత‌కీ ఏ మూడ్‌? అంటూ రోహిత్ కామెంట్ చేశాడు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా