By : Oneindia Telugu Video Team
Published : November 05, 2019, 01:40
Duration : 01:57
01:57
టీమిండియా సెలక్టర్లను మార్చాలి : యువరాజ్ సింగ్
ఆధునిక క్రికెట్ పరంగా సెలెక్టర్ల ఆలోచన బాగాలేదు. టీమిండియాకు మంచి సెలక్టర్లు అవసరవమని భారత మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ అభిప్రాయపడ్డాడు. గాయాలపాలైనా లేదా ఆరోగ్యం సరిగ్గా లేకపోయినా భారత క్రికెటర్లు మ్యాచ్ ఆడక తప్పడం లేదన్నాడు. ఆడని పక్షంలో జట్టులో చోటు గల్లంతవుతుందనే ఆందోళనతో విధిలేని పరిస్థితుల్లో ఆటగాళ్లు మైదానంలోకి దిగుతున్నారు అని యువీ పేర్కొన్నాడు.తాజాగా యువరాజ్ ముంబైలోని విలేకరులతో మాట్లాడుతూ... 'టీమిండియాకు కచ్చితంగా మంచి సెలక్టర్లు అవసరం. మన సెలక్టర్ల బాధ్యత అంత సులువైనది కాదు. సెలక్టర్లు 15 మందిని ఎంపిక చేసిన తర్వాత ఇతర ఆటగాళ్లను ఎందుకు ఎంపికవ్వలేదని చర్చలు జరుగుతాయి. అన్ని పరిగణలోకి తీసుకోవాలి. ఆటగాళ్లకు అండగా నిలవడంలో నేను ముందుంటాను' అని అన్నాడు.