By: Oneindia Telugu Video Team
Published : August 01, 2017, 11:22

కోహ్లి ,రాహుల్ పై చురకలంటించిన యువీ..

Subscribe to Oneindia Telugu

గాలే వేదికగా ఆతిథ్య శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా 304 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఐదు రోజుల టెస్టు నాలుగు రోజులకే ముగియడంతో గెలుపు అనంతరం టీమిండియా ఆటగాళ్లు స్విమ్మింగ్ పూల్‌లో సేదతీరుతూ కనిపించారు. దీనికి సంబంధించిన ఫోటోలను కెప్టెన్ విరాట్ కోహ్లీ తన ట్విట్టర్లో అభిమానులతో పంచుకున్నాడు. స్విమ్మింగ్‌ పూల్‌లో కెప్టెన్ కోహ్లీతో దిగిన ఫొటోని కేఎల్ రాహుల్‌ కూడా తన ట్విటర్‌ ద్వారా పంచుకున్నాడు. 'సెల్ఫీ దిగుదామని కెప్టెన్ కోరాడు. గాలేలోని ఓ బీచ్‌లో కోహ్లీతో సరదాగా' అని ఆ ఫొటో కింద రాహుల్‌ కామెంట్ పెట్టాడు.కేఎల్‌ రాహుల్‌ చేసిన ఓ ఈ ట్వీట్‌‌పై వెటరన్ క్రికెటర్ యువరాజ్‌ సింగ్‌ తనదైన శైలిలో స్పందించాడు. 'నువ్వు అసలు ఏం చెప్పదలుచుకున్నావు. విరాట్‌ కోహ్లీ సెల్ఫీ అడగడంతో మరో అవకాశం లేక అతనితో పోజిచ్చావు. కెప్టెన్ చెప్పిన మాట వింటున్నావని మాకు అర్థమైంది' అని పేర్కొన్నాడు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా