By : Oneindia Telugu Video Team
Published : March 15, 2018, 03:18
01:17
ఫటాఫట్ - ధనాధన్ : చాహల్ మాయ
టీ 20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా భారత యువ మణికట్టు స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ నిలిచాడు. భారత్ తరఫున అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో జడేజాను వెనక్కి నెట్టిన చాహల్ నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు.
ముక్కోణపు టోర్నీలో భాగంగా బుధవారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో చాహల్ ఆ దేశ కెప్టెన్ మహమ్మదుల్లా వికెట్ తీసేయడంతో జడేజా రికార్డును అవలీలగా దాటేశాడు. 9వ ఓవర్లో చాహల్ వేసిన బంతిని ఎదుర్కొన్న మహమ్మదుల్లా(11).. కేఎల్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో చాహల్‌కి ఇది 32వ వికెట్.
రవీంద్ర జడేజా ఇప్పటి వరకు ఈ ఫార్మాట్లో 31వికెట్లు మాత్రమే తీశాడు. చాహల్ 20 మ్యాచ్‌ల ద్వారానే 32 వికెట్లు తీస్తే.. జడేజా 40 మ్యాచ్‌ల్లో 31 వికెట్లను దక్కించుకున్నాడు. అత్యధిక వికెట్లు తీసిన భారత ఆటగాళ్ల జాబితాలో రవిచంద్రన్ అశ్విన్ (52), బుమ్రా(41), ఆశిష్ నెహ్రా(34) తొలి మూడు స్థానాల్లో కొనసాగుతున్నారు.
చాహల్ భారత్ తరపున అంతర్జాతీయ క్రికెట్లో 2016వ సంవత్సరంలో అడుగుపెట్టాడు. జింబాబ్వే పర్యటనలో భాగంగా జరిగిన భారత పర్యటనతో ఆరంగ్రేటం చేశాడు. 2017 నుంచి అతను చక్కని ఫామ్‌ను పుంజుకున్నాడు.