Tap to Read ➤

వేపాకులతో అందం, ఆరోగ్యం.. ఇలా ట్రై చేయండి..!

వేపలో యాంటీబయాటిక్ గుణాలు అధికం.

చర్మంపై మచ్చలు, మొటిమలను తగ్గించడంలో చక్కగా పనిచేస్తాయి.

వేపలోని యాంటీబయాటిక్ గుణాలు చర్మాన్ని అందంగా, ఆరోగ్యంగా ఉంచుతాయి.

కేశ సంరక్షణలోనూ వేపాకులు చక్కగా పనిచేస్తాయి.

గుప్పెడు వేపాకులను రెండు లీటర్ల నీటిలో మరిగించండి.

మరిగించిన వేకాకుల నీటని చల్లారిన తర్వాత బాటిల్‌లో నిల్వచేసుకోవాలి.

ప్రతి రోజూ స్నానం చేసే నీటిలో కొంచెం వేపాకుల నీటిని కలపండి.

తరచూ ఇలా చేయడం వల్ల చర్మ సమస్యలు, మొటిమలు, వైట్‌హెడ్స్ తగ్గిపోతాయి.

వయసు ప్రభావంతో వచ్చే ముడతలు తగ్గిపోతాయి.

వేపనీటిని స్కిన్ టోనర్‌గానూ ఉపయోగించవచ్చు

వేప నీటిలో ఓ కాటన్ బాల్‌ని ముంచి ప్రతి రోజూ రాత్రి ముఖాన్ని తుడుచుకోండి.

తరచూ ఇలా చేయడం వల్ల పిగ్మెంటేషన్, మెటిమలు , మచ్చలు తగ్గిపోతాయి.

వేపాకులు, నారింజ తొక్కలను కలిపి గుజ్జుగా మారేవరకు మరిగించాలి.

మరిగించిన ఈ నీటిలో కొద్దిగా తేనె, పెరుగు, సోయా పాలు కలపండి.

వారానికి మూడు సార్లు ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత కడిగేయండి.

తరచూ ఇలా చేయడం వల్ల మొటిమలు, వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ వంటి సమస్యలు తగ్గుతాయి.

వేపాకుల ఫేస్ ప్యాక్ చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తుంది.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి

 Venkatakishore kolli

Credits
twitter