Tap to Read ➤

వంటింటి చిట్కాలతో జలుబు, దగ్గు మాయం..!

అనేక రోగాలకు మన వంటగదే పార్మసీలా పనిచేస్తుంది.
Venkatakishore kolli

చలికాలంలో చిన్నా పెద్దా తేడా లేకుండా జలుబు, దగ్గు వంటి సమస్యల బారిన పడుతుంటారు.

కిచెన్‌లో దొరికే పదార్థాలతో దగ్గు, జలుబు సమస్యలను తగ్గించుకోవచ్చు.

ఆవిరి పట్టడం, గార్గిల్ చేయడం వల్ల ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు

ఒక టీ స్పూన్ పసుపు, నల్లమిరియాలు, తేనె కలిపిన మిశ్రమాన్ని తీసుకుంటే జలుబు నుంచి ఉపశమనం పొందవచ్చు.

ప్రతి రోజూ కనీసం 2 లేదా 3 సార్లు తులసి నీరు తాగాలి.

ఉసిరి, పైనాపిల్, నిమ్మ, కివీ వంటి పండ్లను ఆహారంలో భాగంగా చేర్చుకోవాలి.





తాగేందుకు, స్నానం చేసేందుకు చల్లటి నీరును ఉపయోగించవద్దు.





జీర్ణక్రియ మెరుగుయ్యేందుకు ఎక్కువగా గోరువెచ్చని నీటిని తాగాలి.

తేనె తీసుకుంటే గొంతు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.





కాఫీ, టీలకు బదులు అల్లం, పసుపు, లెమన్ టీ తాగడం మంచిది.

గోరువెచ్చని పాలలో కొంచెం పసుపు కలుపుకుని తాగితే ఆరోగ్యానికి మంచిది.

గోరువెచ్చని నీటిలో కొద్దిగా పసుపు, ఉప్పు కలిపి గార్గిల్ చేస్తే గొంతునొప్పి పోతుంది.

తులసి ఆకులను నమలడం వల్ల జలుబు, దగ్గు నుంచి ఉపశమనం పొందవచ్చు.





బయటి ఆహారం, కొవ్వు పదార్థాలు, వేయించిన ఆహారం తగ్గించాలి.




తేలికగా ఉండే ఆహారాన్ని తీసుకుంటే మంచిది.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి