Tap to Read ➤

కరోనా కొత్త వేరియంట్ XE లక్షణాలు

కరోనా మహామ్మారి తగ్గిందనుకుంటున్న తరుణంలో కొత్త వేరియంట్ XE వైరస్ ప్రపంచాన్ని కలవరపెడుతోంది.

కరోనా వేరియంట్ XE తొలిసారిగా జనవరి 19న బ్రిటన్‌లో గుర్తించారు. ఇంగ్లాండ్‌లో మార్చి 22 నాటికి 637 కేసులు నమోదైనట్లు WHO ప్రకటించింది.

ఇప్పటికే ఈ XE వేరియంట్ వైరస్ థాయిలాండ్, న్యూజిలాండ్, అమెరికా, చైనాకు పాకింది. తాజాగా ఇండియాకు కూడా వ్యాపించింది.

మన దేశంలో XE వేరియంట్ తొలికేసు ముంబైలో నమోదైనట్లు వైద్యులు నిర్థారించారు.

కరోనా బిఏ.2 ఒమిక్రాన్ వేరియంట్‌తో పోల్చితే ఈ XE వైరస్ పది రెట్లు వేగంగా వ్యాప్తిస్తుందని WHO ఎపిడెమియోలాజికల్ నివేదిక హెచ్చరించింది.

కొత్త వేరియంట్ XE వైరస్ సోకిన వారికి జలుబు, ముక్కు తరుచుగా కారడం, తుమ్ములు, గొంతు నొప్పి, వంటి అరోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్యులు చెబుతున్నారు.

కరోనా వైరస్ అంతం కాలేదని, నాలుగో దశ ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా నిబంధనలు తప్పక పాటించాలని సూచిస్తున్నారు.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com