Kolli Venkata Kishore Mar 22, 2024
సబ్జా గింజలను అతిగా తీంటే ఆరోగ్య సమస్యలు తప్పవు..!
వేసవి కాలంలో నీటిలో నానబెట్టిన సబ్జా గింజలు తీసుకుంటే శరీరం చల్లబడుతుంది.
శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది.
కానీ సబ్జా గింజలను అతిగా తింటే ఆరోగ్య సమస్యలు తప్పవని వైద్య నిపుణులు హెచ్చరిక.
సబ్జా గింజలను ఎక్కవగా తీసుకుంటే జీర్ణక్రియ సమస్యలు తలెత్తుతాయి.
సబ్జా గింజల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా తీసుకోవడం వల్ల సరిగ్గా జీర్ణం చేసుకోవడం కష్టం.
సబ్జా గింజలను అతిగా తింటే విరేచనాలు, ఉబ్బరం, స్టమక్ క్రాంప్స్ వస్తాయి.
సబ్జా గింజలను ఎక్కువగా తీసుకోవడం వలన రక్తాన్ని పలుచగా చేస్తాయి.
సబ్జా గింజలను ప్రతి రోజూ తీసుకుంటే రక్తపోటు సమస్యలు వస్తాయి.
బీపీ మందులను తీసుకునేవారైతే వైద్యులను సంప్రదించాలి.
మోతాదుకు మించి సబ్జా విత్తనాలను తీసుకోవద్దు.
సబ్జా గింజలను రోజుకు 1-1.5 టేబుల్ స్పూన్ల వరకు మాత్రమే తీసుకోవాలి.
క్యారెట్ జ్యూస్ ఎందుకు తాగాలంటే ?
Next Story