Tap to Read ➤

మాంసం అధికంగా తింటే గుండె జబ్బులు వస్తాయా ?

ఏ ఆహారమైన మితంగా తింటేనే ఆరోగ్యంగా ఉంటాం.

మాంసం ఎక్కువగా తింటే గుండె రక్తనాళాల్లో పూడికల ముప్పు ఎక్కువ

టప్ట్స్ యూనివర్సిటీ, క్లివ్ లాండ్ క్లినిక్ పరిశోధనలో ఆసక్తికర విషయాలు వెల్లడి

మాంసంలో ఎల్ కార్నిటైన్ రసాయనం, కోలిన్ పోషకం అధికం

వీటిని పేగుల్లో ఉండే సూక్ష్మ క్రిములు జీర్ణం చేసుకుంటాయి.

ట్రైమిథైలమైన్-ఎన్-ఆక్సైడ్, వై-బుటీరోబెటైన్, క్రోటోనోబెటైయిన్ వంటి రసాయనాలు పుట్టుకొస్తాయి.

ఇవి గుండె రక్తనాళాల్లో పూడికలు ఏర్పడటంలో పాలు పంచుకుంటాయని గుర్తింపు

హార్మోన్ల మాదిరిగా రక్తం ద్వారా శరీరమంతా ప్రయాణిస్తూ ప్రభావం చూపుతాయని అధ్యయంలో గుర్తింపు

పూడికలు ఏర్పడటానికి, గుండె జబ్బుల ముప్పు పెరగడానికి దోహదం చేస్తాయని వెల్లడి

అధిక రక్తపోటు, రక్తంలో అధిక కొలెస్ట్రాల్ కన్నా ఇవే ఎక్కువగా గుండెజబ్బు ముప్పును పెంచుతాయని పేర్కొన్న నిపుణులు

పేగుల్లోని బ్యాక్టీరియా పెద్దమొత్తంలో మెటబాలైట్లను ఉత్పత్తి చేసేవారికి పూడికల ముప్పు పెరుగుతుంది

కొందరికి రక్తనాళాల్లో పూడికల ముప్పు ఎందుకు ఎక్కువగా ఉంటోందనే గుట్టును ఈ అధ్యయనం ద్వారా కొంతవరకు ఛేదించినట్టయ్యింది.

రెడ్ మీట్‌లో కొవ్వు అధికం. ఇది అజీర్ణం, మలబద్దకానికి దారితీస్తుంది.

రెడ్ మీట్ ఎక్కువ తినే పురుషుల్లో పెద్దప్రేగు సమస్యలు తలెత్తుతాయి.

మాంసాహారం మితంగా తింటే మంచిదని చెబుతున్న వైద్యులు

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి

 Venkatakishore kolli

Credits
twitter