Tap to Read ➤

IPL 2022: ఐపీఎల్ చరిత్రలో టాప్ 10 హాట్ ఫీమేల్ యాంకర్లు,హోస్ట్‌లు

ఐపీఎల్ అంటేనే క్యాష్ రిచ్ గేమ్. ఇటు ఆటతో పాటు గ్లామర్‌ కూడా ఈ టోర్నమెంట్‌కు పెద్ద అసెట్‌గా నిలిచింది.ఈ నేపథ్యంలోనే ఐపీఎల్ 2022లో గ్లామరస్ ఫీమేల్ యాంకర్లు ఎవరో చూద్దాం.
లేఖ వాషింగ్టన్

స్మాల్ స్క్రీన్‌ పై చాలా ఎంటర్‌టెయిన్‌మెంట్ షోలకు హోస్ట్‌గా వ్యవహరించింది ఈ ముద్దుగుమ్మ.2008 ఐపీఎల్ సీజన్‌లో హోస్ట్‌గా వ్యవహరించింది.

రోచెలీ మారియా రావ్

ఒకప్పటి మోడల్ ఆ తర్వాత నటిగా మంచి గుర్తింపు పొందిన రోచెలీ ఐపీఎల్ 2013 సీజన్‌లో సోనీ టీవీలో ఎక్స్‌ట్రా ఇన్నింగ్స్‌ హోస్ట్‌గా వ్యవహరించింది. అంతేకాదు 2012లో ఫెమినా మిస్‌ ఇండియా ఇంటర్నేషనల్ టైటిల్‌ను సొంతం చేసుకుంది
మందిరాబేడీ

 మోడల్ నటి అయిన మందిరా బేడీ 2009లో సౌతాఫ్రికాలో జరిగిన ఐపీఎల్‌కు హోస్ట్‌గా వ్యవహరించింది.
షోనాలీ నాగ్‌రాణి

 షోనాలీ నాగ్‌రాణి మాజీ మిస్ ఇండియా ఇంటర్నేషనల్. ఐపీఎల్ 2008 సీజన్‌లో ఈమె గ్లామర్‌కు ఫిదా కాని వారంటూ లేరు.ఎక్స్‌ట్రా ఇన్నింగ్స్‌తో పాటు ఇతర క్రికెట్ ఈవెంట్స్‌కు కూడా హోస్ట్‌గా వ్యవహరించింది.
అర్చన విజయ

 అర్చన విజయ అంటే యూత్ పడి చస్తుంది. మోడల్ ఆ తర్వాత యాంకర్‌గా మంచి గుర్తింపు పొందిన అర్చన చాలా ఐపీఎల్ ఈవెంట్స్‌లో హోస్ట్‌గా వ్యవహరించింది.
మయాంతి లాంగర్

దేశంలోనే అత్యంత పాపులారిటీ దక్కించుకున్న మహిళా స్పోర్ట్స్ యాంకర్‌గా మయాంతి గుర్తింపు పొందింది. ఇండియన్ క్రికెటర్ స్టువర్ట్ బిన్నీ భార్యే మయాంతి
కరిష్మా కొటాక్

 మెగాస్టార్ చిరంజీవి పక్కన శంకర్ దాదా జిందాబాద్ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన ఈ ముద్దుగుమ్మ ఐపీఎల్ 2014లో ప్రెజెంటర్‌గా వ్యవహరించింది.
షిబానీ దండేకర్

 షిబానీ దండేకర్ పాపులర్ వీజే మరియు స్పోర్ట్స్ ప్రజెంటర్. 2014లో ఐపీఎల్‌తో అసోసియేట్ అయ్యింది. స్టేడియం నుంచి రిపోర్టింగ్ చేస్తూ అదే సమయంలో ఎక్స్‌ట్రా ఇన్నింగ్స్‌ను కూడా హ్యాండిల్ చేసింది.
సంజనా గణేషన్
మిస్‌ ఇండియా 2014 ఫైనలిస్ట్ సంజనా గణేషన్ ప్రస్తుతం పాపులారిటీ కలిగిన స్పోర్ట్స్ యాంకర్. 2018 నుంచి సంజనా ఐపీఎల్ హోస్ట్‌గా వ్యవహరిస్తోంది. సంజనా భారత క్రికెటర్ జస్ప్రీత్ బుమ్రాను పెళ్లి చేసుకుంది.

నిఖితా దత్త

వెండితెర బుల్లితెర నటిగా గుర్తింపు పొందిన నిఖితా దత్త 2018 నుంచి 2021 వరకు ఐపీఎల్ సీజన్లలో తన వంతు పాత్ర పోషించింది.
మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్‌డేట్స్ కోసం సందర్శించండి: telugu.oneindia.com