Tap to Read ➤

ఈ రోజు రాశి ఫలాలు.

మే 1 ఆదివారం 2022

మేషరాశి వారికి ఈ రోజు బంధువులతో సఖ్యత. విందువినోదాలు. భూవివాదాల నుంచి బయటపడతారు. శ్రమకు ఫలితం దక్కుతుంది. వ్యాపారాలలో ప్రోత్సాహం. ఉద్యోగులకు కొన్ని చికాకులు తొలగుతాయి.

వృషభరాశి వారికి ఈ రోజు ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు. మానసిక అశాంతి. అనారోగ్యం. పనులలో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

మిధునరాశి వారికి ఈ రోజు దూరప్రాంతాల నుంచి కీలక సమాచారం. ఉద్యోగయత్నాలలో అనుకూలత. విందువినోదాలు. కార్యజయం. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. వ్యాపారాలు సంతృప్తినిస్తాయి.

కర్కాటకరాశి వారికి ఈ రోజు బంధువులు, మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. వస్తు, వస్త్రలాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

సింహరాశి వారికి ఈ రోజు ప్రయాణాలలో ఆటంకాలు. ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. బంధువర్గంతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.

కన్యారాశి వారికి ఈ రోజు బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆరోగ్య, కుటుంబ సమస్యలు. ప్రయాణాలలో మార్పులు. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి.

తులారాశి వారికి ఈ రోజు చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగులకు  పదోన్నతులు

వృశ్చికరాశి వారికి ఈ రోజు కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు వింటారు. ఆస్తిలాభం. సోదరుల నుంచి సహాయం. ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.

ధనుస్సురాశి వారికి ఈ రోజు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. రుణాలు చేస్తారు. ప్రయాణాలలో మార్పులు. దైవదర్శనాలు. సోదరులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.

మకరరాశి వారికి ఈ రోజు అనుకోని ప్రయాణాలు. బంధువులు, మిత్రులతో మాటపట్టింపులు. అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. వ్యాపార విస్తరణలో అవరోధాలు. ఉద్యోగులకు విధుల్లో చికాకులు.

కుంభరాశి వారికి ఈ రోజు బంధువులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. ఆస్తి వివాదాల నుంచి కొంత బయటపడతారు. వాహన, గృహయోగాలు. ఉద్యోగలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.

మీనరాశి వారికి ఈ రోజు కొత్తగా చేపట్టిన కార్యక్రమాలు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. దైవదర్శనాలు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలలో నిరుత్సాహం. ఉద్యోగులకు శ్రమాధిక్యం.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

Add Button Text