ఈ రోజు మీ రాశి ఫలం.
ఏప్రిల్ 25 సోమవారం 2022
మేషరాశి వారికి ఈ రోజు వ్యవహార విజయం. అరుదైన ఆహ్వానాలు. విందువినోదాలు. కాంట్రాక్టులు పొందుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.
వృషభరాశి వారికి ఈ రోజు రాబడి కంటే ఖర్చులు పెరుగుతాయి. బంధువులతో అకారణ వైరం. ఆరోగ్యసమస్యలు చికాకు పరుస్తాయి.
మిధునరాశి వారికి ఈ రోజు కుటుంబసభ్యులతో వివాదాలు నెలకొంటాయి. బాధ్యతలు పెరుగుతాయి. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి.
కర్కాటకరాశి వారికి ఈ రోజు కార్యక్రమాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. పరపతి పెరుగుతుంది.
సింహరాశి వారికి ఈ రోజు నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. పరిచయాలు పెరుగుతాయి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ప్రత్యర్థులు స్నేహితులుగా మారతారు.
కన్యారాశి వారికి ఈ రోజు ఆకస్మిక ప్రయాణాలు. సన్నిహితుల నుంచి విమర్శలు. కాంట్రాక్టులు చేజారతాయి. కృషి ఫలించదు. కార్యక్రమాలు ముందుకు సాగవు.
తులారాశి వారికి ఈ రోజు కుటుంబసభ్యుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. కార్యక్రమాలలో ఆటంకాలు. వృథా ఖర్చులు. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి.
వృశ్చికరాశి వారికి ఈ రోజు కుటుంబంలో శుభకార్యాలు. అదనపు ఆదాయం. చర్చలు సఫలం. ప్రముఖులతో పరిచయాలు. కాంట్రాక్టులు పొందుతారు.
ధనుస్సురాశి వారికి ఈ రోజు కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. కష్టానికి తగ్గ ఫలితం కనిపించదు. బంధువులు, స్నేహితులతో తగాదాలు. ఆరోగ్యసమస్యలు.
మకరరాశి వారికి ఈ రోజు స్నేహితులతో వివాదాలు పరిష్కారం. ఆస్తిలాభం. బంధువుల నుంచి ఆహ్వానాలు. కళాకారులకు ఊహించని అవకాశాలు. వ్యాపారాలలో అనుకూలం
కుంభరాశి వారికి ఈ రోజు వ్యవహారాలలో అవాంతరాలు. వృథా ఖర్చులు. కుటుంబంలో అదనపు బాధ్యతలు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం.
మీనరాశి వారికి ఈ రోజు కార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. ఆస్తిలాభం. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. కొత్త నిర్ణయాలు. ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.
మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com
Add Button Text