Tap to Read ➤

నేడు మీ రాశి ఫలాలు.

మే 2 సోమవారం 2022

మేషరాశి వారికి ఈ రోజు పనులు చక్కదిద్దుతారు. ఆప్తుల నుంచి శుభవర్తమానాలు. అదనపు రాబడి. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

వృషభరాశి వారికి ఈ రోజు పనుల్లో అవాంతరాలు. రుణయత్నాలు. అనారోగ్యం. కుటుంబసభ్యులతో విభేదాలు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

మిధునరాశి వారికి ఈ రోజు పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత పురోగతి.





కర్కాటకరాశి వారికి ఈ రోజు ఆస్తులు కొనుగోలు చేస్తారు. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం. వాహనయోగం. చర్చలు సఫలం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని మార్పులు.




సింహరాశి వారికి ఈ రోజు మిత్రులతో కలహాలు. రుణబాధలు. విలువైన వస్తువులు జాగ్రత్త. ఆలోచనలు స్థిరంగా ఉండవు. పనుల్లో అవాంతరాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.


కన్యారాశి వారికి ఈ రోజు పనులు ముందుకు సాగవు. ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. శ్రమాధిక్యం. కుటుంబబాధ్యతలు పెరుగుతాయి. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి





తులారాశి వారికి ఈ రోజు దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విచిత్రమైన సంఘటనలు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం తొలగుతుంది.



వృశ్చికరాశి వారికి ఈ రోజు ఇంటాబయటా అనుకూలం. కొత్త విషయాలు తెలుస్తాయి. విద్యార్థులకు ఉత్సాహం. సోదరులతో సఖ్యత. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో మీ అంచనాలు ఫలిస్తాయి.



ధనుస్సురాశి వారికి ఈ రోజు రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా. పనుల్లో ఆటంకాలు. సోదరులతో కలహాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు


మకరరాశి వారికి ఈ రోజు వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. అనుకున్న వ్యవహారాలు ముందుకు సాగవు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిదానిస్తాయి.

కుంభరాశి వారికి ఈ రోజు ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. దైవదర్శనాలు. వస్తులాభాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో మీ సత్తా చాటుకుంటారు.

మీనరాశి వారికి ఈ రోజు కొన్ని వ్యవహారాలు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో సమస్యలు. అనుకోని ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత నిరుత్సాహపరుస్తాయి.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

Add Button Text