Tap to Read ➤

నేడు మీ రాశి శుభ ఫలాలు..

ఈ రోజు మీ రాశి ఫలాలు మే 7 శనివారం 2022
Kolli Venkata Kishore

మేషరాశి వారికి ఈ రోజు బాకీలు వసూలవుతాయి. ఆప్తులు, బంధువులతో వివాదాలు తీరతాయి. స్థిరాస్తి వృద్ధి. ముఖ్య నిర్ణయాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో లాభాలు అందుతాయి.

వృషభరాశి వారికి ఈ రోజు పనుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. శ్రమాధిక్యం. దూరప్రయాణాలు. అనారోగ్యం. దైవచింతన. వ్యాపారాలలో ఆటంకాలు. ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి.

మిధునరాశి వారికి ఈ రోజు చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. పనుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వస్తులాభాలు. వ్యాపారాలు కొంత పుంజుకుంటాయి.

కర్కాటకరాశి వారికి ఈ రోజు ఆర్థిక ఇబ్బందులు. కొత్త రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో విభేదాలు. ప్రయాణాలలో అవాంతరాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాదాసీదాగా సాగుతాయి.

సింహరాశి వారికి ఈ రోజు ప్రముఖుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. వ్యవహారాలలో పురోభివృద్ధి. ఉద్యోగయోగం. వ్యాపారాలలో లాభాలు.

కన్యారాశి వారికి ఈ రోజు సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. మీ సేవలకు గుర్తింపు రాగలదు. ఆర్థికాభివృద్ధి. వాహనయోగం. కొన్ని వివాదాలు పరిష్కారం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి.

తులారాశి వారికి ఈ రోజు కుటుంబసభ్యులతో వైరం. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులను కలుసుకుంటారు. కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆరోగ్యం కొంత మందగిస్తుంది. వ్యాపారాలలో కొద్దిపాటి చికాకులు.

వృశ్చికరాశి వారికి ఈ రోజు ఉద్యోగయత్నాలు నిరాశ పరుస్తాయి. ముఖ్యమైన పనుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితి ఇబ్బంది కలిగిస్తుంది. వ్యయప్రయాసలు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలలో నిరుత్సాహం.

ధనుస్సురాశి వారికి ఈ రోజు నిరుద్యోగులకు ఉద్యోగలాభం. పనులు చకచకా సాగుతాయి. ఆప్తుల సలహాలు పాటిస్తారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. దైవదర్శనాలు. వ్యాపారాలలో చిక్కులు తొలగుతాయి.

మకరరాశి వారికి ఈ రోజు ప్రముఖులు సహాయపడతారు. ఆర్థికంగా బలపడతారు. ప్రయాణాలలో కొత్త పరిచయాలు. శుభవార్తలు. వాహనయోగం. విద్యావకాశాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి.

కుంభరాశి వారికి ఈ రోజు ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు. ధనవ్యయం. అనారోగ్యం. కుటుంబసభ్యులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

మీనరాశి వారికి ఈ రోజు మిత్రులతో కలహాలు. ఆర్థిక ఇబ్బందులు. అనుకోని ప్రయాణాలు. దైవదర్శనాలు. అనారోగ్య సూచనలు. పనుల్లో అవాంతరాలు. వ్యాపారాలలో ఇబ్బందులు. ఉద్యోగాలలో కొత్త సమస్యలు.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

Add Button Text