Tap to Read ➤

ఈ రాశుల వారికి పట్టిందంతా బంగారమే.

ఈ రోజు మీ రాశి ఫలాలు ఏప్రిల్ 21 గురువారం 2022

మేషరాశి వారికి ఈ రోజు కుటుంబంలో స్వల్ప వివాదాలు. ప్రయాణాలలో అవాంతరాలు. కొత్త రుణాలు చేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. ధనవ్యయం.

వృషభరాశి వారికి ఈ రోజు సన్నిహితుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. చర్చలు సఫలం. ఇంటాబయటా అనుకూలం. ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు.

మిధునరాశి వారికి ఈ రోజు మిత్రులతో వివాదాలు తీరతాయి. ఆలోచనలు అమలు చేస్తారు. పనులలో జాప్యం. ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి.

కర్కాటకరాశి వారికి ఈ రోజు మిత్రులు, బంధువులతో అకారణ వైరం. కుటుంబంలో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనారోగ్యం.

సింహరాశి వారికి ఈ రోజు ఆర్థిక ఇబ్బందులు. పనుల్లో ప్రతిబంధకాలు. శ్రమాధిక్యం. దూరప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. ఆరోగ్యభంగం.

కన్యారాశి ఈ రోజు అనుకున్న పనులు దిగ్విజయంగా సాగుతాయి. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు. విందువినోదాలు. దూరపు బంధువుల కలయిక.వాహనయోగం.

తులారాశి వారికి ఈ రోజు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు.

వృశ్చికరాశి వారికి ఈ రోజు రుణవిముక్తి. సంఘంలో గౌరవం. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. చర్చల్లో పురోగతి. ముఖ్య నిర్ణయాలు.

ధనుస్సురాశి వారికి ఈ రోజు మిత్రులతో వివాదాలు. ఆలోచనలు అంతగా కలసిరావు. కుటుంబబాధ్యతలు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు.

మకరరాశి వారికి ఈ రోజు మిత్రులతో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు. ఆత్మీయుల ఆదరణ లభిస్తుంది. పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు.

కుంభరాశి వారికి ఈ రోజు సన్నిహితుల నుంచి కీలక సమాచారం. విందువినోదాలు. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు కొన్ని వసూలవుతాయి.

మీనరాశి వారికి ఈ రోజు ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. ఒప్పందాలలో అవాంతరాలు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. దైవచింతన.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com