Tap to Read ➤

Horoscope Today : ఈ రాశుల వారికి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే..

10 అక్టోబర్ సోమవారం 2022
Venkatakishore kolli

ఈ రోజు  ఆకస్మిక ప్రయాణాలు చెయ్యవలసి రావచ్చు. నూతన రుణాలు చేస్తారు. వ్యాపారాలలో ఒడిదుడుకులు తప్పవు. సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు కొన్ని వ్యవవహారాలలో ఎంత కష్టించినా ఫలితం కనిపించదు. భూవివాదాలు చికాకు కలిగిస్తాయి.

ఈ రోజు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. నూతన వ్యక్తుల పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. సన్నిహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు. ఉద్యోగాలలో పనిభారం తగ్గుతుంది. ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

ఈ రోజు చేపట్టిన పనుల్లో అప్రయత్న విజయం సాధిస్తారు. ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుతుంది. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ధనపరంగా అనుకూలత పెరుగుతుంది. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమవుతాయి.

ఈ రోజు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. చేపట్టిన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి.  పాత రుణాలు తీర్చడానికి నూతన రుణాలు చేస్తారు. దైవదర్శనాలు చేసుకుంటారు. ఉద్యోగాలలో కొద్దిపాటి సమస్యలు తప్పవు.

ఈ రోజు రుణదాతల ఒత్తిడులు చికాకు కలిగిస్తాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలు సాధారణంగా సాగుతాయి ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు చేస్తారు. బంధు మిత్రులతో ఊహించని విభేదాలు కలుగుతాయి.

ఈ రోజు ఉద్యోగాలలో అంచనాలు అందుకుంటారు. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.

ఈ రోజు వృత్తి ఉద్యోగాలలో శ్రమ ఫలిస్తుంది. సోదరుల నుంచి ఆకస్మిక ధనప్రాప్తి పొందుతారు. కుటుంబ సభ్యులతో దైవదర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు అభివృద్ధి బాటలో సాగుతాయి ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. స్థిరస్తి క్రయ విక్రయలు లాభసాటిగా సాగుతాయి.

ఈ రోజు ఆర్థిక ఇబ్బందులు వలన మానసిక సమస్యలు కలుగుతాయి. కొన్ని పనులు శ్రమతో కానీ పూర్తికావు. ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపార,ఉద్యోగాలు నిరాశపరుస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి.

ఈ రోజు వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన చికాకు పరుస్తుంది.  ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి.

ఈ రోజు చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. సన్నిహితుల నుంచి ధనలాభ సూచనలున్నవి. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి.  రాజకీయ వర్గం వారి నుండి అరుదైనా ఆహ్వానాలు అందుతాయి.

ఈ రోజు  కొన్ని పనులు వ్యయప్రయాసలతో కానీ పనులు పూర్తికావు. బంధువులు మీ మాటతో విభేదిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి నిరాశాజనకంగా ఉంటుంది.చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి.

ఈ రోజు నూతన వ్యవహారాలు కార్యరూపం దాలుస్తాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి. సంఘంలో పెద్దల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి