Tap to Read ➤

Horoscope Today : ఈ రాశుల వారు ధన పరంగా ఇతరులకు మాట ఇవ్వరాదు

11 అక్టోబర్ మంగళవారం 2022
Venkatakishore kolli

ఈ రోజు అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. గృహమున శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి. వ్యాపార వ్యవహారాల్లో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు.

ఈ రోజు స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. జీవిత భాగస్వామితో మాటపట్టింపులు కలుగుతాయి. ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. వృత్తి, వ్యాపారాలలో అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది.

ఈ రోజు ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. కొన్ని వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుని లాభపడతారు. నూతన వాహనయోగం ఉన్నది. వృత్తి, వ్యాపారాలలో ఆర్థిక పురోగతి సాధిస్తారు. వ్యాపారస్థులకు అవసరానికి ధన సహాయం అందుతుంది.

ఈ రోజు విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు బంధు మిత్రుల నుండి కొత్త విషయాలు తెలుసుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో కష్టానికి తగిన ఫలితం పొందుతారు. ఉద్యోగాలలో అధికారులతో చర్చల్లో పురోగతి కలుగుతుంది.

ఈ రోజు  ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఇంటాబయట కొద్దిపాటి సమస్యలు తప్పవు. ఉద్యోగమున సహోద్యోగులతో మాటపట్టింపులు కలుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి.

ఈ రోజు చేపట్టిన వ్యవహారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. ఆస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. . ఇతరులకు ధన పరంగా మాట ఇవ్వడం మంచిది కాదు. ఉద్యోగాల్లో కష్టానికి తగిన గుర్తింపు లభించదు.

ఈ రోజు మొండి బాకీలు వసూలవుతాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి సన్నిహితులతో విందువినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలు మరింత ఆశాజనకంగా సాగుతాయి.

ఈ రోజు వృత్తి, వ్యాపారాలలో ఆశించిన లాభాలు పొందుతారు. చాలకాలంగా పూర్తికానీ పనులు సకాలంలో పూర్తి అవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. పాతబాకీలు వసూలవుతాయి.

ఈ రోజు ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. వృత్తి, వ్యాపారాలు కొంత మందకోడిగా సాగుతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శ్రద్ద వహించాలి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించవు బంధువులతో ఊహించని వివాదాలు కలుగుతాయి.

ఈ రోజు బంధుమిత్రుల నుంచి ఊహించని మాటలు వినవలసి వస్తుంది. చేపట్టిన పనులు మధ్యలో వాయిదా వేస్తారు. వృత్తి, వ్యాపారాలలో చికాకులు పెరుగుతాయి. అవసరానికి ఇతరుల సహాయ సహకారాలు అందక ఇబ్బంది పడతారు.

ఈ రోజు మొండి బాకీలు వసూలవుతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశములు లభిస్తాయి.  బంధువుల కలయిక ఆనందం కలిగిస్తుంది వ్యాపార, ఉద్యోగాలు అనుకూలంగా సాగుతాయి చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి.

ఈ రోజు అనుకున్న పనులు సకాలంలో పూర్తికావు. ఉద్యోగమున పని ఒత్తిడి పెరిగి సమయానికి నిద్రహారాలు ఉండవు. వృత్తి, వ్యాపారాలలో ఊహించని మార్పులు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో స్వంత ఆలోచనలు కలసిరావు.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి