Tap to Read ➤

Horoscope Today : ఈ రాశుల వారికి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

12 అక్టోబర్ బుధవారం 2022
Venkatakishore kolli

ఈ రోజు దూరపు బంధువుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. చేపట్టిన వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి వ్యాపారాల విస్తరణకు నూతన ప్రణాళికలు అమలుచేస్తారు. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి.

ఈ రోజు వృధా ఖర్చులు పెరుగుతాయి.దైవ చింతన కలుగుతుంది. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. ఇంటా బయట నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. వ్యాపారాలు కొంత మందగిస్తాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి.

ఈ రోజు ఉద్యోగమున ఉన్నతి కలుగుతుంది. విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు. వ్యాపారమున లాభాలు పెరుగుతాయి.సమాజంలో ప్రముఖుల సహాయ సహకారాలు అందుతాయి. నిరుద్యోగ సమస్యలు తొలగుతాయి.

ఈ రోజు వ్యాపార, ఉద్యోగాలలో మరింత ఉత్సాహంగా రాణిస్తారు. సన్నిహితుల నుండి విలువైన సమాచారం అందుతుంది. కీలక సమయంలో కుటుంబ సభ్యుల సహాయం అందుతుంది. ఆర్థిక పరిస్థితి ఆశజనకంగా ఉంటుంది.

ఈ రోజు సోదరులతో ఆస్తి వివాదాలు కలుగుతాయి.   ఉద్యోగమున చికాకులు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించనప్పటికి అవసరానికి ధనం అందుతుంది. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి.

ఈ రోజు చేపట్టిన పనులలో అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు. విద్యార్థుల పరీక్ష ఫలితాలు నిరాశ కలిగిస్తాయి. భూ సంభంధిత వివాదాలు కలుగుతాయి. ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. వ్యాపారమున పెట్టుబడుల విషయంలో పునరాలోచన చెయ్యడం మంచిది.

ఈ రోజు ఉద్యోగాలలో అనుకున్నది సాధిస్తారు. జీవిత భాగస్వామితో దైవ దర్శనాలు చేసుకుంటారు వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది.

ఈ రోజు ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. మొండిబాకీలు వసూలవుతాయి.  చాలకాలంగా వేదిస్తున్న సమస్యలు పరిష్కారమౌతాయి

ఈ రోజు చేపట్టిన పనులలో శ్రమ మరింత పెరుగుతుంది. రుణదాతల ఒత్తిడితో నూతన రుణాలు చెయ్యవలసి వస్తుంది. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగాలలో కొందరి ప్రవర్తన శిరోబాధను కలిగిస్తుంది. ప్రయాణాలు వాయిదా పడుతాయి.

ఈ రోజు ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. అనుకున్న వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. వ్యాపారాలు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. కుటుంబసభ్యులతో అకారణంగా తగాదాలు కలుగుతాయి.

ఈ రోజు వృత్తి ఉద్యోగాలలో మీ సేవలకు తగిన గుర్తింపు లభిస్తుంది. గృహమున మిత్రులతో మరింత ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు

ఈ రోజు వ్యాపారాలు మందగిస్తాయి. బంధువులతో మాటపట్టింపులుంటాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగమున కొన్ని వ్యవవహారాలలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. చేపట్టిన పనుల్లో అవాంతరాలు తప్పవు.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి