Tap to Read ➤

ఈ  రోజు మీ రాశి శుభ ఫలాలు..!

మే 20 శుక్రవారం 2022
Kolli Venkata Kishore

మేషరాశి వారికి ఈ రోజు దూరప్రయాణాలు. చర్చల్లో ప్రతిష్ఠంభన. విలువైన వస్తువులు జాగ్రత్త. ఆలోచనలు స్థిరంగా ఉండవు. శ్రమాధిక్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు. ఇంటాబయటా ఒత్తిడులు.

వృషభరాశి వారికి ఈ రోజు కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. కీలక నిర్ణయాలు. పనులు చకచకా పూర్తి కాగలవు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు.

మిధునరాశి వారికి ఈ రోజు వివాదాలు పరిష్కారం. శుభవార్తలు వింటారు. కాంట్రాక్టర్లకు అనుకూలం. ఆకస్మిక ధన, వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు వేస్తారు.

కర్కాటకరాశి వారికి ఈ రోజు వ్యవహారాలలో అవాంతరాలు. రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. సోదరులతో కలహాలు. దైవచింతన. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

సింహరాశి వారికి ఈ రోజు పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలోచనలు కలసిరావు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు. అనారోగ్యం.

కన్యారాశి వారికి ఈ రోజు మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. మీసత్తా నిరూపించుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. విందువినోదాలు. కార్యజయం. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.

తులారాశి వారికి ఈ రోజు వ్యవహారాలలో ఆటంకాలు. వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. శ్రమాధిక్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం. ఆరోగ్యభంగం.

వృశ్చికరాశి వారికి ఈ రోజు పలుకుబడి పెరుగుతుంది. వ్యవహారాలలో విజయం. ఆప్తులు సలహాలు పాటిస్తారు. వస్తులాభాలు. ఆర్థిక ఇబ్బందులు తీరతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహం.

ధనుస్సురాశి వారికి ఈ రోజు రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసభ్యులతో తగాదాలు. పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు కలసిరావు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు సంభవం.

మకరరాశి వారికి ఈ రోజు ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడుల నుంచి విముక్తి.

కుంభరాశి వారికి ఈ రోజు కొత్త వ్యక్తులు పరిచయం. శుభవార్తలు. వాహనయోగం. భూవివాదాలు పరిష్కారం. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు.

మీనరాశి వారికి ఈ రోజు వ్యయప్రయాసలు. మిత్రులతో మాటపట్టింపులు. ఆలయాలు సందర్శిస్తారు. దూరప్రయాణాలు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. వ్యాపార, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి