Tap to Read ➤

నేడు మీ రాశి ఫలాలు..

21 మే శనివారం 2022
Kolli Venkata Kishore

మేషరాశి వారికి ఈ రోజు సమాజంలో నూతన పరిచయాలు పెరుగుతాయి. ఆప్తుల నుండి శుభవార్తలు. అన్ని వైపుల నుండి ఆదాయం అందుతుంది. చేపట్టిన వ్యవహారాలలో పురోగతి కనిపిస్తుంది. వ్యాపారాలు అనుకూలిస్తాయి.

వృషభరాశి వారికి ఈ రోజు ఆర్థికవ్యవహారాలలో లోటుపాట్లు ఉంటాయి. అనుకోని ప్రయాణాలు శ్రమను కలిగిస్తాయి. ఇంటాబయట ఒత్తిడులు పెరుగుతాయి. కీలక వ్యవహారాలలో అవరోధాలు

మిధునరాశి వారికి ఈ రోజు ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేస్తారు. అనుకున్న సమయానికి ధనం అందక రుణఒత్తిడి పెరుగుతుంది ప్రయాణాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి.

కర్కాటకరాశి వారికి ఈ రోజు నిరుద్యోగ అవకాశములు మెరుగుపడతాయి. సంఘంలో ప్రముఖుల నుండి ప్రశంసలు అందుకుంటారు. గృహమున సంతోషకర వాతావరణం ఉంటుంది. ఆర్ధిక అభివృద్ధి కలుగుతుంది.

సింహరాశి వారికి ఈ రోజు సోదరుల నుండి శుభవార్తలు అందుతాయి. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. నిరుద్యోగులకు అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. వ్యాపారాలలో కార్యజయం. కలుగుతుంది.

కన్యారాశి వారికి ఈ రోజు ప్రయాణాలలో తొందరపాటు మంచిది కాదు. అకారణంగా బంధువులతో తగాదాలు కలుగుతాయి. సంతాన అనారోగ్య విషయాలు బాధిస్తాయి. ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి.

తులారాశి వారికి ఈ రోజు కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు అవసరమౌతాయి. బంధు మిత్రుల మాటలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి, అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.

వృశ్చికరాశి వారికి ఈ రోజు కుటుంబ సభ్యులతో గృహమున ఆనందంగా గడుపుతారు. వృత్తి ఉద్యోగములలో మీ సేవలకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. స్ధిరాస్తి లాభం కలుగుతుంది.

ధనుస్సురాశి వారికి ఈ రోజు నూతన రుణాలు ప్రయత్నాలు చేస్తారు. అధిక శ్రమతోకాని పనులు పూర్తి కావు. అవసరానికి కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందక ఇబ్బంది కలుగుతుంది.

మకరరాశి వారికి ఈ రోజు సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. కావలసిన బంధువుల నుండి ఊహించని ఆహ్వానాలు ఆనందం కలిగిస్తాయి. గృహోప కరణాలు కొనుగోలు చేస్తారు.

కుంభరాశి వారికి ఈ రోజు చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో స్వంత ఆలోచనలు కలిసిరావు. ధన పరంగా ఇబ్బందులు. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.

మీనరాశి వారికి ఈ రోజు ఆర్ధికవ్యవహారాలు లాభసాటిగా సాగుతాయి. అవసరానికి అందరి సహాయం అందుతుంది.పాత మిత్రులతో కలిసి కొన్ని విషయాలు గూర్చి చర్చలు చేస్తారు. గృహనిర్మాణ ప్రయత్నాలు ప్రారంభిస్తారు.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి