Tap to Read ➤

Horoscope Today : ఈ రాశుల వారికి ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది.

22 అక్టోబర్ శనివారం 2022
Venkatakishore kolli

ఈ రోజు  వ్యయప్రయాసలతో కొన్ని పనులు పూర్తి అవుతాయి అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగాలలో చికాకులు మరింత పెరుగుతాయి ధనవ్యయ సూచనలు ఉన్నవి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

ఈ రోజు నూతన వస్తులాభాలు ఉంటాయి. ఆకస్మిక ధనలబ్ధి కలుగుతుంది. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. దూరపు బంధువుల నుండి విలువైన సమాచారం అందుతుంది.

ఈ రోజు నూతన వాహనయోగం ఉన్నది. సమాజంలో పరపతి పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలలో సన్నిహితుల సహాయ సహకారాలు అందుతాయి. దైవదర్శనాలు చేసుకుంటారు వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.

ఈ రోజు పట్టిన పనులలో శ్రమ తప్పదు. బంధువులతో మాటపట్టింపులు కలుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి. వ్యాపార వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చేసి నష్టాలు ఎదుర్కొంటారు.

ఈ రోజు ఎంత శ్రమపడిన పనులు ముందుకు సాగవు. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. ముఖ్యమైన పనులలో వ్యయప్రయాసలు అధికమవుతాయి. మానసిక సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగాలలో అధికారుల నుంచి ఒత్తిడి అధికమవుతుంది.

ఈ రోజు  శుభవార్తలు అందుకుంటారు. నూతన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపార వ్యవహారాలలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకుంటారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. స్థిరాస్తి క్రయ విక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు.

ఈ రోజు ధన పరమైన చికాకులు పెరుగుతాయి. మిత్రులతో ఊహించని మాటపట్టింపులు కలుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు కలుగుతాయి. గృహ వాతావరణం చికాకుగా ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు నిదానంగా సాగుతాయి.

ఈ రోజు వ్యాపారాలు అభివృద్ధి బాటలో పయనిస్తాయి చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు.  ఉద్యోగాలలో అధికారులతో చర్చలు సఫలం అవుతాయి ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి.నిరుద్యోగుల చిరకాల స్వప్నం నెరవేరుతుంది.

ఈ రోజు  దూరప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది.మిత్రుల నుంచి ఋణ ఒత్తిడులు పెరుగుతాయి. చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు తప్పవు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు మందగిస్తాయి.

ఈ రోజు నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఉద్యోగాలలో ఉన్నతి కలుగుతుంది.ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది.

ఈ రోజు చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు.వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలంగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. అధికారులతో చర్చలు సఫలం అవుతాయి.

ఈ రోజు ఆర్థిక ఇబ్బందులు అధికమౌతాయి. ఇంటా బయట పరిస్థితులు అనుకూలించవు. వృత్తి ఉద్యోగాలలో శ్రమ తప్పదు. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది ముఖ్యమైన వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ కలిగిస్తాయి.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి