Tap to Read ➤

Horoscope Today : ఈ రాశుల వారికి అన్ని వైపుల నుండి ఆర్థిక లాభాలు.

23 అక్టోబర్ ఆదివారం 2022
Venkatakishore kolli

ఈ రోజు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.వృత్తి ఉద్యోగ అధికారులతో చర్చలు సఫలమౌతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ప్రయాణ లాభలున్నవి చేపట్టిన పనులలో జాప్యం కలిగినప్పటికి నిదానంగా పూర్తిచేస్తారు.

ఈ రోజు సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. గృహమున విలువైన వస్తువుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఊహించని విధంగా ఇతరులతో విరోధాలు కలుగుతాయి వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది.

ఈ రోజు వృత్తి వ్యాపారాలలొ మిశ్రమ ఫలితాలుంటాయి. శారీరక మానసిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. పాత రుణాలు తీర్చగలుగుతారు. ఉద్యోగస్తులు వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.

ఈ రోజు నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి.  అన్ని వైపుల నుండి ఆర్థిక లాభాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలు ఆశించిన విధంగా సాగుతాయి. సోదరులతో సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి.

ఈ రోజు  ప్రారంభించిన పనులు మందగిస్తాయి. ఇంటా బయట ఊహించని సమస్యలు కలుగుతాయి. ధన పరమైన విషయాలలో ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు. కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు తప్పవు. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి.

ఈ రోజు ఆదాయం పెరుగుతుంది. ఇంటాబయటా సమస్యలు ఉన్నప్పటికీ నిదానంగా పరిష్కరించుకుంటారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు వృత్తి వ్యాపారాలలొ నష్టాలు అధిగమించి లాభాలు అందుకుంటారు.

ఈ రోజు నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. కొన్ని వ్యవహారాలలో ఊహించని ఇబ్బందులు ఎదురవుతాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో నిదానంగా వ్యవహరించాలి. వ్యాపారాల్లో ఆశించిన రీతిలో లాభించవు. దూర ప్రయాణ సూచనలున్నవి.

ఈ రోజు దాయాదులతో స్ధిరాస్తి వివాదాల పరిష్కార దిశగా సాగుతాయి. నిరుద్యోగులకు లభించిన అవకాశాలను జారవిడువకుండా చూసుకోవాలి. ఇంటా బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగస్తులు ఉన్నత పదవులు పొందుతారు. కొన్ని వ్యవహారాలలో ఆత్మవిశ్వాసంతో స్థిర నిర్ణయాలు చేసి లాభపడతారు.

ఈ రోజు చేపట్టిన పనులు ముందుకు సాగవు. 
 ఉద్యోగస్తులకు అధికారులతో ఆలోచించి మాట్లాడాలి దూరప్రయాణ సూచనలు ఉన్నవి. వృత్తి వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చెయ్యడం మంచిది కాదు.

ఈ రోజు వృత్తి వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. సంతాన వివాహ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. తల్లి తండ్రుల ఆరోగ్యం విషయంలో శుభ వార్తలు అందుతాయి.

ఈ రోజు అనుకున్న సమయానికి అనుకున్న రీతిలో సౌకర్యాలు లభించక ఇబ్బందిపడతారు. వృత్తి ఉద్యోగాలలో నిలకడ లోపిస్తుంది. దూరప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ధన వ్యవహారాలలో ఇతరులకు మాట ఇచ్చి ఇబ్బందులు ఎదుర్కొంటారు.

ఈ రోజు వృత్తి ఉద్యోగాలలో సహోద్యోగులతో సఖ్యతగా వ్యవహరించి ప్రశంసలు అందుకుంటారు. జీవిత భాగస్వామి బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి