Tap to Read ➤

Horoscope Today : ఈ రాశుల వారు ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చెయ్యద్దు..

28 అక్టోబర్ శుక్రవారం 2022
Venkatakishore kolli

ఈ రోజు ఆర్ధిక పురోగతి సాధిస్తారు. భూ క్రయ విక్రయాలలో ఆశించిన లాభాలు పొందుతారు. వాహన సంభందిత వ్యాపారాలు అనుకూలిస్తాయి.  వృత్తి, ఉద్యోగముల విషయంలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది.

ఈ రోజు ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చెయ్యడం మంచిది కాదు. చే ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నవి. భాగసౌమ్య వ్యాపారాలలో పెట్టుబడులకు అనుకూలంగా లేదు.

ఈ రోజు  ఆదాయ మార్గాలు మరింత పెరుగుతాయి. బంధు మిత్రుల ఆదరణ పెరుగుతుంది. ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వ్యాపారాల విస్తరణకు అవకాశాలు లభిస్తాయి.

ఈ రోజు ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. నూతన పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.

ఈ రోజు వృత్తి వ్యాపారాలలొ ఆలోచించి పెట్టుబడులు పెట్టాలి. స్థిరస్తి క్రయ విక్రయాలలో అనుకూల ఫలితాలు పొందుతారు. ఆర్థిక వ్యవహారాలలొ ఒడిదుడుకులు ఉంటాయి.

ఈ రోజు విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. దీర్ఘకాలిక ఋణాల నుండి కొంత ఊరట లభిస్తుంది. వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. స్వల్ప ధన లాభ సూచనలున్నవి.

ఈ రోజు  ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేస్తారు. వ్యాపారములు మందకొడిగా సాగుతాయి వృత్తి వ్యాపారాలలో చికాకులు తప్పవు.

ఈ రోజు విలువైన వస్తువులు విషయంలో జాగ్రత్త వహించాలి.చేపట్టిన పనులు సకాలంలో పూర్తికావు. ఉద్యోగమున అధికారుల ఆగ్రహానికి గురికావలసి వస్తుంది.

ఈ రోజు చేపట్టిన పనులలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తి చేస్తారు. గృహమున బంధు మిత్రులతో ఆనందంగా గడుపుతారు వృత్తి వ్యాపారములు లాభసాటిగా సాగుతాయి.

ఈ రోజు నూతన వ్యాపార ప్రారంభమునకు అవరోధాలు తప్పవు. చేపట్టిన పనులలో కష్టానికి తగిన ఫలితం ఉండదు. ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగ విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది.

ఈ రోజు ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది.  ముఖ్యమైన వ్యవహారములు అనుకూలంగా సాగుతాయి. కుటుంబ సభ్యుల నుండి అరుదైన బహుమతులు అందుకుంటారు.

ఈ రోజు సంతాన వివాహ విషయమై కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. ఆర్థిక పురోగతి కలుగుతుంది. ఆప్తుల నుండి శుభ వార్తలు అందుతాయి.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి