ఈ రోజు మీ రాశి ఫలాలు
ఏప్రిల్ 16 శనివారం 2022
మేషరాశి వారికి ఈ రోజు కార్యజయం. ఆస్తిలాభం. ప్రముఖులతో పరిచయాలు. ఆలయాలు సందర్శిస్తారు. అందరిలోనూ గౌరవం. వ్యాపారాల్లో వృద్ధి.
వృషభరాశి వారికి ఈ రోజు పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. కొత్త రుణయత్నాలు. బంధుమిత్రులతో విరోధాలు. వ్యాపారాలు మందగిస్తాయి.
మిధునరాశి వారికి ఈ రోజు రాబడికి మించి ఖర్చులు. బాధ్యతలు మరింత పెరుగుతాయి. ప్రయాణాలలో మార్పులు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.
కర్కాటకరాశి వారికి ఈ రోజు యత్నకార్యసిద్ధి. పరిచయాలు పెరుగుతాయి. ఆత్మీయుల నుంచి శుభవర్తమానాలు. అదనపు ఆదాయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి.
సింహరాశి వారికి ఈ రోజు మిత్రులతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. దైవదర్శనాలు. వ్యాపారాలలో కొంత అనుకూలత.
కన్యారాశి వారికి ఈ రోజు స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది
తులారాశి వారికి ఈ రోజు వ్యయప్రయాసలు. మిత్రులతో కలహాలు. అనారోగ్యం. కుటుంబంలో కొన్ని చికాకులు. దూరప్రయాణాలు. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి.
వృశ్చికరాశి వారికి ఈ రోజు శుభకార్యాలు నిర్వహిస్తారు. సంఘంలో ప్రతిష్ఠ పెరుగుతుంది. వస్తులాభాలు. పాతబాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కీలక మార్పులు.
ధనుస్సురాశి వారికి ఈ రోజు నూతన ఉద్యోగయోగం. ప్రముఖులతో పరిచయాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.
మకరరాశి పాదాల వారికి ఈ రోజు మిత్రులతో వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యం మందగిస్తుంది. ధనవ్యయం. ఉద్యోగాలలో సమస్యలు.
కుంభరాశి వారికి ఈ రోజు కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. సన్నిహితులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.
మీనరాశి వారికి ఈ రోజు శ్రమ ఫలిస్తుంది. నూతన వ్యక్తుల పరిచయం. శుభవర్తమానాలు అందుతాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ధనలాభం.
మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com
Add Button Text