Tap to Read ➤

ఈ రోజు మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే ?

ఏప్రిల్ 26 మంగళవారం 2022

మేషరాశి వారికి ఈ రోజు పనులు చకచకా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో వివాదాలు సర్దుకుంటాయి. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక.

వృషభరాశి వారికి ఈ రోజు శ్రమ పెరగవచ్చు. రాబడి, ఖర్చులు సమానంగా ఉంటాయి. దూరప్రయాణాలు. సోదరులతో మాటపట్టింపులు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

మిధునరాశి వారికి ఈ రోజు పనులు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో తగాదాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలలో లేనిపోని సమస్యలు.

కర్కాటకరాశి వారికి ఈ రోజు పరిచయాలు పెరుగుతాయి. ఆత్మీయులతో ఉత్సాహంగా గడుపుతారు. ధనలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.

సింహరాశి వారికి ఈ రోజు విద్యార్థులకు శుభవార్తలు. వాహనయోగం. ఆకస్మిక ధనలాభం. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి.

కన్యారాశి వారికి ఈ రోజు రుణాలు చేస్తారు. ఆత్మీయులతో విభేదాలు. ప్రయాణాలు చేస్తారు. శ్రమాధిక్యం. పనులు ముందుకు సాగవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

తులారాశి వారికి ఈ రోజు పనుల్లో తొందరపాటు. ఆకస్మిక ప్రయాణాలు. ఆస్తులు వివాదాలు. సోదరుల నుంచి సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

వృశ్చికరాశి వారికి ఈ రోజు కుటుంబంలో ఒత్తిడులు తొలగుతాయి. ఆప్తుల నుంచి కీలక సమాచారం. వస్తులాభాలు. పరిస్థితులు అనుకూలిస్తాయి.

ధనుస్సురాశి వారికి ఈ రోజు కొత్తరుణాలు చేస్తారు. ఆత్మీయులతో విభేదాలు. పనులలో అవాంతరాలు. శ్రమాధిక్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.

మకరరాశి వారికి ఈ రోజు వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల నుంచి శుభవార్తలు. వాహనాలు కొంటారు. భూములు, వాహనాలు కొంటారు. ఉద్యోగాలలో వివాదాలు సర్దుకుంటాయి.

కుంభరాశి వారికి ఈ రోజు మిత్రులతో కలహాలు. వ్యవహారాలలో అవాంతరాలు. నిర్ణయాలు మార్చుకుంటారు. కష్టమే తప్పితే ఫలితం ఉండదు. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి.

మీనరాశి వారికి ఈ రోజు నూతన పరిచయాలు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పనులు విజయవంతంగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

more updates