Tap to Read ➤

ఈ రోజు మీ రాశిలో శుభ ఫలాలు

ఏప్రిల్ 28 గురువారం 2022

మేషరాశి వారికి ఈ రోజు కుటుంబంలో ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. కొన్ని పనులు మందగిస్తాయి. నిర్ణయాలు మార్పుచుకుంటారు. ఉద్యోగాలలో కొంత నిరుత్సాహం.

వృషభరాశి వారికి ఈ రోజు సన్నిహితుల నుంచి ధనలబ్ధి. పరిచయాలు పెరుగుతాయి. ఆస్తి వివాదాలు పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యవహారాలలో విజయం.

మిధునరాశి వారికి ఈ రోజు శ్రమ ఫలిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు.

కర్కాటకరాశి వారికి ఈ రోజు వ్యవహారాలలో అవాంతరాలు. ప్రయాణాలు వాయిదా. శ్రమాధిక్యం. సోదరుల నుంచి ఒత్తిడులు. వ్యాపారాలు కొంత అనుకూలం.

సింహరాశి వారికి ఈ రోజు కొన్ని వ్యవహారాలు మందగిస్తాయి. శ్రమాధిక్యం. ఉద్యోగయత్నాలు ముందుకు సాగవు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో కొంత నిరుత్సాహం.

కన్యారాశి వారికి ఈ రోజు ఆకస్మిక ధనలబ్ధి. కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు. పరిచయాలు మరింత పెరుగుతాయి. వ్యవహారాలలో విజయం. వ్యాపారవృద్ధి..

తులారాశి వారికి ఈ రోజు సన్నిహితుల సాయం అందుతుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. వాహనయోగం. ఉద్యోగాలలో ముందడుగు.

వృశ్చికరాశి వారికి ఈ రోజు మిత్రులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలలో స్వల్ప అవాంతరాలు. ఆరోగ్యభంగం. ఆకస్మిక ప్రయాణాలు.

ధనుస్సురాశి వారికి ఈ రోజు కొద్దిపాటి చికాకులు ఎదుర్కొంటారు. అనుకున్న పనుల్లో అవాంతరాలు. రుణయత్నాలు. ప్రయాణాలు వాయిదా. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి.


మకరరాశి వారికి ఈ రోజు చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. భూములు, వాహనాలు కొంటారు. ధనలబ్ధి. కొత్త పనులు చేపడతారు. వ్యాపారాలు ఆశాజనకం

కుంభరాశి వారికి ఈ రోజు బంధువులను కలుసుకుంటారు. కొన్ని పనులు వాయిదా వేస్తారు. అనారోగ్యం. దూరప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు.

మీనరాశి వారికి ఈ రోజు కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. వాహనయోగం. ఆస్తి వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

Add Button Text