Tap to Read ➤

నేడు మీ రాశిలో శుభ ఫలాలు..

మే 8 ఆదివారం 2022
Kolli Venkata Kishore

మేషరాశి వారికి ఈ రోజు పనుల్లో జాప్యం. ఆర్థికాంశాలలో గందరగోళం. దూరప్రయాణాలు. మిత్రులతో కలహాలు. ఆరోగ్యసమస్యలు. ఆస్తి వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అంతగా కలసిరావు.

వృషభరాశి వారికి ఈ రోజు మిత్రులు సహకరిస్తారు. ధన, వస్తులాభాలు. ఎంతటి వారినైనా ఆకట్టుకుంటారు. ఆస్తులు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

మిధునరాశి వారికి ఈ రోజు వ్యవహారాలలో అవాంతరాలు. కొత్త రుణాలు చేస్తారు. బాధ్యతలు పెరుగుతాయి. మీ ఆలోచనలు బంధువులకు నచ్చవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

కర్కాటకరాశి వారికి ఈ రోజు పాతబాకీలు వసూలవుతాయి. ఏ పని చేపట్టినా విజయం. సమావేశాలకు హాజరవుతారు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందుకు సాగుతారు.

సింహరాశి వారికి ఈ రోజు కొన్ని కార్యక్రమాలు వాయిదా పడతాయి. కష్టమే తప్పితే ఫలితం కనిపించదు. ఆస్తులు కొనుగోలులో ఆటంకాలు. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు వివాదాలతో నడుస్తాయి.

కన్యారాశి వారికి ఈ రోజు దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. వాహనయోగం. చర్చలు సఫలం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

తులారాశి వారికి ఈ రోజు సమస్యల పరిష్కారం. శుభవార్తా శ్రవణం. ఆకస్మిక ధనలాభం. ప్రముఖులతో పరిచయాలు. యత్నకార్యసిద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల ప్రభావం.

వృశ్చికరాశి వారికి ఈ రోజు కొత్త రుణాలు చేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. పనుల్లో జాప్యం. బంధువర్గంతో తగాదాలు. ఆరోగ్యంపై నిర్లక్ష్యం వద్దు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిదానిస్తాయి.

ధనుస్సురాశి వారికి ఈ రోజు నిరుద్యోగుల యత్నాలలో అవాంతరాలు. రుణబాధలు. పనులు వాయిదా వేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.

మకరరాశి వారికి ఈ రోజు పరిచయాలు విస్తృతమవుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. నేర్పుగా వివాదాలు పరిష్కరించుకుంటారు. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఎదురులేని పరిస్థితి.

కుంభరాశి వారికి ఈ రోజు సన్నిహితులు, శ్రేయోభిలాషుల నుంచి ముఖ్య సమాచారం. విందువినోదాలు. కార్యజయం. మీ అంచనాలు నిజం చేసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.

మీనరాశి వారికి ఈ రోజు వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

Add Button Text