Tap to Read ➤

ఆంధ్ర రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న తెలంగాణ ఆడబిడ్డ !

విడదల రజని స్వగ్రామం యాదాద్రిభువనగరి జిల్లా, తుర్కపల్లి మండలం, కొండాపురం

సీఎం జగన్ మంత్రి వర్గంలో కుటుంబ సంక్షేమం, ఆరోగ్య, వైద్య విద్య శాఖ మంత్రిగా విడదల రజనికి చోటు.

రాగుల సత్తయ్య రెండో కుమార్తె రజని మంత్రి కావటంపై కొండాపురం గ్రామస్తులు హర్షం. ఆనందంలో కుటుంబ సభ్యులు.

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

ముదిరాజ్ కుటుంబానికి చెందిన రజని కుటుంబం బతుకుదెరువు కోసం 40 ఏళ్ల కిందట హైదారాబాద్‌కు వలస. సఫిల్‌గూడలో నివాసం.

రజని విద్యాభ్యాసం అంతా తెలంగాణలోనే. మల్కాజిగిరిలోని సెయింట్ ఆన్స్ మహిళా కళాశాలలో 2011లో బీఎస్సీ కంపూటర్స్ లో డిగ్రీ. ఆపై ఎంబీఏ చేశారు.

హైదరాబాద్ లో సాప్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్న సమయంలో రజనికి విడదల కుమారస్వామితో వివాహం. అమెరికాకి వెళ్లి ఐటీ కంపెనీ పెట్టి ఆర్థికంగా స్థిరపడింది.

2014లో అమెరికా నుంచి తిరిగి వచ్చి టీడీపీ ద్వారా రాజకీయ ఆరంగేట్రం.

2019 వైసీపీ తీర్థం పుచ్చుకున్న రజని చిలకలూరిపేట నుంచి ఎమ్మెల్యేగా విజయం.

32 ఏళ్లకే మంత్రి పదవిని దక్కించుకుని పొలిటికల్ ట్రెండ్ సెట్టర్ గా మారారు. తక్కువ సమయంలోనే సీఎం జగన్ వద్ద ఎక్కువ ప్రాధాన్యత.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

Add Button Text