Tap to Read ➤

ఎంపీలకు మోదీ సర్కార్ షాక్ !

కేంద్రీయ విద్యాలయాల్లో ప్రత్యేక కోటాపై కేంద్రం సంచలన నిర్ణయం

కేంద్రీయ విద్యాలయాల్లో ఎంపీల సిఫార్సు లేఖలకు చెక్ పెట్టింది. కోటా కింద కేటాయించే ప్రత్యేక సీట్లను రద్దు చేసింది.

ఈమేరకు రాష్ట్రాలకు కేంద్రీయ విద్యాలయ సంఘటన్ ఉత్తర్వులు జారీ చేసింది.

ఇప్పటి వరకు ఒక్కో ఎంపీకి ప్రతి ఏటా 10 సీట్లు కేటాయింపు.

ప్రవేశాల కోసం కోటా పెంచాలని ఎంపీలు డిమాండ్ . కానీ మొత్తం కోటానే రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం.

కేంద్రీయ విద్యాలయాల్లో కోటా ఎత్తేయడంతో ఎంపీలకు ఎదురుదెబ్బ తగిలింది. ఎంపీల కోటాలో పారదర్శకత లోపిస్తోందన్న విమర్శలతో నిర్ణయం.

పార్లమెంటు ఉభయసభల్లో ఉన్న 788 మంది ఎంపీలు ఏటా మొత్తం 7,880 మంది విద్యార్థులకు కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్లు ఇప్పిస్తున్నారు.

ఇకపై అన్ని రాష్ట్రాల్లో ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో సీట్లు మెరిట్, రిజర్వేషన్ల ఆధారంగా భర్తీ చేయాలని నిర్ణయం.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com