Tap to Read ➤

రాజకీయాల్లోకి సోనియా గాంధీ అల్లుడు ?

పొలిటికల్ ఎంట్రీపై రాబర్ట్ వాద్రా కీలక వ్యాఖ్యలు

ప్రజలు కోరుకుంటే రాజకీయల్లోకి వచ్చేందుకు సిద్దమే. సేవ చేసేందుకు రాజకీయాల్లోనే ఎక్కువ అవకాశం ఉంటుంది.

రాజకీయాల్లోకి వచ్చినా రాకపోయినా ప్రజలకు సేవ చేస్తా. అదే నా లక్ష్యం. ఆ దిశగా ముందుకెళ్తా.

గత పదేళ్లుగా స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేస్తున్నా. భవిష్యత్తులోనూ కొనసాగిస్తా.

నేను ఎప్పుడూ ప్రజల మధ్యే ఉన్నా. వారు నాతోనే ఉన్నారని భావిస్తున్నా. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూడాలి.

దేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు చూస్తుంటే చాలా అసహనంగా ఉన్నాయి. దేశాన్ని వెనక్కి తీసుకెళ్తున్నారు.

నిజాన్ని ప్రజలకు చూపించేందుకు మీడియా కూడా భయపడుతోంది. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు.

యూపీలో ప్రియాంక గాంధీ రాత్రింబవళ్లు కష్టపడ్డారు. కానీ రెండు సీట్లకే పరిమితం అయ్యాం. ప్రజల తీర్పును అంగీకరిస్తున్నాం.

యూపీ ఎన్నికల్లో ప్రియాంక గాంధీ కృషికి 10కి 10 మార్కులు వేస్తా.!

ఈవీఎంలపై ప్రజల్లో సందేహాల్ని నివృత్తి చేస్తే దేశంలో ఎన్నికల ఫలితాలు భిన్నంగా వస్తాయి.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com