Tap to Read ➤

ఈ రోజు మీ రాశిలో శుభ ఫలాలు..!

మే 10 మంగళవారం 2022
Kolli Venkata Kishore

మేషరాశి వారికిఈ రోజు సన్నిహితులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. వ్యయప్రయాసలు. ఆరోగ్యసమస్యలు. శ్రమ మరింత పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.

వృషభరాశి వారికి ఈ రోజు కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. వాహనయోగం. పరిస్థితులు అనుకూలిస్తాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ తొలగుతుంది.

మిధునరాశి వారికి ఈ రోజు వ్యవహారాలలో అవాంతరాలు. కొత్త రుణాలు చేస్తారు. నిర్ణయాలు మార్చుకుంటారు. మానసిక అశాంతి. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.

కర్కాటకరాశి వారికి ఈ రోజు సన్నిహితులతో సఖ్యత. ఇంటాబయటా అనుకూలం. కొత్త పనులు చేపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

సింహరాశి వారికి ఈ రోజు వ్యవహారాలు మందగిస్తాయి. సోదరులతో కలహాలు. నిర్ణయాలు మార్చుకుంటారు. దూరప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు.

కన్యారాశి వారికి ఈ రోజు ఇంటర్వ్యూలు రాగలవు. ఆస్తి వివాదాలు కొలిక్కి తెచ్చుకుంటారు. ధన, వస్తులాభాలు. పరిచయాలు పెరుగుతాయి.. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.

తులారాశి వారికి ఈ రోజు చిన్ననాటి మిత్రుల కలయిక. శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకూలస్థితి.

వృశ్చికరాశి వారికి ఈ రోజు రుణబాధలు. ఆకస్మిక ప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా. చర్చలు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా సాగవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు అనివార్యం.

ధనుస్సురాశి వారికి ఈ రోజు బాధ్యతలు పెరుగుతాయి. సన్నిహితులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు ఉండవచ్చు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి.

మకరరాశి వారికి ఈ రోజు పనులు సాఫీగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల ఆదరణ లభిస్తుంది. ఒక సమాచారం ఊరటనిస్తుంది. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో సజావుగా సాగుతాయి.

కుంభరాశి వారికి ఈ రోజు సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. సేవాభావం పెరుగుతుంది. పరిస్థితులు అనుకూలిస్తాయి. పనుల్లో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.

మీనరాశి వారికి ఈ రోజు పనుల్లో అవాంతరాలు. రుణబాధలు. ఆకస్మిక ప్రయాణాలు. సన్నిహితులతో విభేదాలు. అనారోగ్య సూచనలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

Add Button Text