Tap to Read ➤

ఈరోజు మీ రాశి ఫలాలు.!

మే 11 బుధవారం 2022
Kolli Venkata Kishore

మేషరాశి వారికి ఈ రోజు సన్నిహితులతో విభేదాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. విద్యార్థుల యత్నాలు ముందుకు సాగవు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

వృషభరాశి వారికి ఈ రోజు చేపట్టిన వ్యవహారాలలో అవాంతరాలు. దూరప్రయాణాలు. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.

మిధునరాశి వారికి ఈ రోజు మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. వేడుకల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధనలబ్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

కర్కాటకరాశి వారికి ఈ రోజు ఆర్థికంగా కొంత వెసులుబాటు ఉంటుంది. అనుకోని ప్రయాణాలు. పనుల్లో ప్రతిష్ఠంభన. అనారోగ్యం. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

సింహరాశి వారికి ఈ రోజు కొత్త విషయాలు తెలుస్తాయి. పోటీపరీక్షల్లో విజయం. శుభకార్యాలకు హాజరవుతారు. వాహనయోగం. ఆస్తిలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.

కన్యారాశి వారికి ఈ రోజు సన్నిహితులతో మాటపట్టింపులు. కుటుంబంలో ఒత్తిడులు. ఆలయ దర్శనాలు. చేపట్టిన పనులు నెమ్మదిగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి గందరగోళం.

తులారాశి వారికి ఈ రోజు చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం. విందువినోదాలు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.

వృశ్చికరాశి వారికి ఈ రోజు కొన్ని సమస్యలు తీరతాయి. బంధువుల నుంచి ధనలబ్ధి. వాహనయోగం. నూతన విద్య, ఉద్యోగావకాశాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

ధనుస్సురాశి వారికి ఈ రోజు వ్యవహారాలు నెమ్మదిగా సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా కొన్ని సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఇబ్బందులు.

మకరరాశి వారికి ఈ రోజు కొన్ని పనులు వాయిదా వేస్తారు. విద్యార్థుల యత్నాలు నిదానిస్తాయి. దూరప్రయాణాలు. బంధువులతో వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు.

కుంభరాశి వారికి ఈ రోజు నూతన ఉద్యోగాలు దక్కుతాయి. పరిచయాలు విస్తృతమవుతాయి. ఆలోచనలు కలసివస్తాయి. విందువినోదాలు. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు.

మీనరాశి వారికి ఈ రోజు విద్యార్థులకు శుభవార్తలు. వాహనయోగం. ఆకస్మిక ధనలబ్ధి. పరిచయాలు పెరుగుతాయి. పనులు చకచకా పూర్తి చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత పురోగతి.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

Add Button Text