Tap to Read ➤

ఈ రోజు మీ రాశి ఫలాలు.!

మే 13 శుక్రవారం 2022
Kolli Venkata Kishore

మేషరాశి వారికి ఈ రోజు పనులు నెమ్మదిగా సాగుతాయి. దూరప్రయాణాలు. బంధువర్గంతో తగాదాలు. కష్టపడ్డా ఫలితం కనిపించదు. వ్యాపారాలు నిరాశ కలిగించవచ్చు. ఉద్యోగాలలో కొన్ని చికాకులు.

వృషభరాశి వారికి ఈ రోజు ఆదాయానికి మించి ఖర్చులు. బాధ్యతలు అథికమవుతాయి. సోదరులతో విభేదాలు. అనారోగ్య సూచనలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

మిధునరాశి వారికి ఈ రోజు ఆసక్తికర సమాచారం వింటారు. బంధువులతో మనస్పర్థలు తొలగుతాయి. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి.

కర్కాటకరాశి వారికి ఈ రోజు విచిత్ర సంఘటనలు. ఆప్తులు, శ్రేయోభిలాషులతో కలహాలు. కొత్త రుణాలు చేస్తారు. మానసిక అశాంతి. వ్యాపారాలు, ఉద్యోగాలు అంతగా కలసిరావు.

సింహరాశి వారికి ఈ రోజు బంధువుల ఆదరణ లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. భూవివాదాలు పరిష్కారం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకూలత.

కన్యారాశి వారికి ఈ రోజు పనులు నెమ్మదిగా కొనసాగుతాయి. ఆప్తుల నుంచి ఒత్తిడులు. కొత్త రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

తులారాశి వారికి ఈ రోజు పరిచయాలు పెరుగుతాయి. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. పాతమిత్రుల కలయిక. విందువినోదాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో హోదాలు పొందుతారు.

వృశ్చికరాశి వారికి ఈ రోజు శ్రమాధిక్యంతో పనులు పూర్తి. సేవాకార్యక్రమాలు చేపడతారు. ఆత్మీయుల నుంచి పిలుపు రావచ్చు. పరపతి పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త మార్పులు.

ధనుస్సురాశి వారికి ఈ రోజు శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. బంధువులు, మిత్రులతో కలహాలు. రుణయత్నాలు సాగిస్తారు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

మకరరాశి వారికి ఈ రోజు సోదరులతో విభేదిస్తారు. అనుకోని ప్రయాణాలు. కొన్ని ఒప్పందాలు వాయిదా వేస్తారు. సన్నిహితుల సాయం అభ్యర్థిస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత గందరగోళంగా ఉంటాయి.

కుంభరాశి వారికి ఈ రోజు పరిస్థితులు అనుకూలిస్తాయి. సమాజంలో గౌరవమర్యాదలు పొందుతారు. వస్తులాభాలు. చాకచక్యంగా సమస్యలు పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అనుకూలత.

మీనరాశి వారికి ఈ రోజు కొత్త ఉద్యోగాలు దక్కుతాయి. ప్రముఖులతో పరిచయాలు. ఆలయాలు సందర్శిస్తారు. అందరిలోనూ గౌరవం. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

Add Button Text